యడ్డీకి అడుగడుగునా అడ్డు తగులుతున్నారా?

కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ యడ్యూరప్పకు ఎలాంటి సంతోషం లేదు. పార్టీలో తన మాట నెగ్గడం లేదన్నది యడ్యూరప్ప భావనగా ఉంది. మరో రెండున్నరేళ్లు అధికారంలో బీజేపీ ఉండాల్సి [more]

Update: 2020-08-30 18:29 GMT

కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ యడ్యూరప్పకు ఎలాంటి సంతోషం లేదు. పార్టీలో తన మాట నెగ్గడం లేదన్నది యడ్యూరప్ప భావనగా ఉంది. మరో రెండున్నరేళ్లు అధికారంలో బీజేపీ ఉండాల్సి ఉంది. ఇప్పటికే యడ్యూరప్పకు వ్యతిరేకంగా బీజేపీలో ఒక వర్గం తయారయింది. అది చాలా స్ట్రాంగ్ గా ఉంది. యడ్యూరప్ప ను కట్టడి చేయాలన్నది ఈ వర్గం ఆలోచనగా ఉంది. యడ్యూరప్ప వలస వాదులకు ప్రభుత్వంలో పెద్దపీట వేయాలనుకోవడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు.

గతంలో మాదిరిగా లేరని….

యడ్యూరప్ప గతంలో మాదిరిగా లేరు. ఇది కర్ణాటక బీజేపీలో విన్పిస్తున్న మాట. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యడ్యూరప్ప పార్టీ విధేయులకే అగ్రతాంబూలం ఇచ్చేవారు. కష్టపడి పార్టీ జెండాను మోసిన వారికి పదవులు కట్టబెట్టేవారు. కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. మంత్రిపదవులు వారికే ఇస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ వారికే పెద్దపీట వేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది.

అధికారంలోకి రావడానికి….

కానీ యడ్యూరప్పకు అది తప్పడం లేదు. 14 నెలల కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి తిరిగి అధికారంలోకి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వారికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎవరికి ఇస్తామన్నది యడ్యూరప్ప ప్రశ్న. అందుకోసమే తాను వారికి ప్రాధాన్యత ఇస్తున్నానని, పార్టీ కోసం కష్టపడిని వారిని విస్మరించడం లేదని పదే పదే యడ్యూరప్ప వివరణ ఇచ్చుకుంటున్నా బీజేపీ నేతలు మాత్రం అందుకు అంగీకరించడం లేదు.

మంత్రి వర్గ విస్తరణపై…..

యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేయాలనుకుంటున్నారు. ఆరుగురిని కొత్తగా కేబినెట్ లో చేర్చుకోవాలనుకుంటున్నారు. ఎంబీటీ నాగరాు, శంకర్, హెచ్ విశ్వనాధ్ లకు ఇవ్వాలని యడ్యూరప్ప నిర్ణయించారు. మరో ముగ్గురి పేర్లను ఖరారు చేయాల్సి ఉంది. అయితే అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్ కు ఈ పనిని అప్పగించింది. ఆయన అందరి అభిప్రాయాలను తీసుకుని అధిష్టానానికి నివేదికను సమర్పించనున్నారు. యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఉన్న నేతలను కూడా సంతోష్ కలిసి మాట్లాడుతున్నారు. ఇది యడ్యూరప్ప వర్గానికి మింగుడు పడటం లేదు. అధిష్టానం తనను కట్టడి చేయడానికే వ్యతిరేక వర్గానికి సహకరిస్తుందని యడ్యూరప్ప అనుమానిస్తున్నారు. మొత్తం మీద కర్ణాటకలో యడ్యూరప్ప పార్టీ పరంగా ఇబ్బంది పడుతున్నారు.

Tags:    

Similar News