అప్ప కు మరో కుదుపు… అయితే డోన్ట్ కేర్ అట

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పపై అసమ్మతి కొనసాగుతూనే ఉంది. మంత్రి పదవులురాని వారంతా మళ్లీ ఒక్కటవుతున్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అసమ్మతి ఎక్కువగానే కన్పిస్తుంది. [more]

Update: 2021-02-11 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పపై అసమ్మతి కొనసాగుతూనే ఉంది. మంత్రి పదవులురాని వారంతా మళ్లీ ఒక్కటవుతున్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అసమ్మతి ఎక్కువగానే కన్పిస్తుంది. అయితే ఎప్పటికప్పడు వాటిని సర్దుబాటు చేసుకుంటూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన రాజకీయ చతురతను చాటుకుంటున్నారు. మొన్నటి వరకూ అసంతృప్తి నేతలుగా ఉన్న ఉమేష్ కత్తి, మురుగేశ్ నిరాణిలకు మొన్న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కడంతో వారు పక్కకు తప్పుకున్నారు.

అసమ్మతి నేతలు…..

వారిస్థానంలో మరికొందరు అసమ్మతికి నేతృత్వం వహిస్తున్నారు. బీజేపీలో ఉన్న దాదాపు ఇరవై నుంచి ముప్ఫయి మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు మంత్రి పదవులు దక్కకపోవడంతో అసమ్మతిని వ్యక్తం చేస్తుండగా మరికొందరు తమ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో పట్టించుకోవడం లేదన్న అసహనంతో ఉన్నారు. ప్రస్తుతం అసమ్మతి నేతలందరికీ మాజీ మంత్రి రేణుకాచార్య, బసనగౌడ పాటిల్ లు నేతృత్వం వహిస్తున్నారు.

కుదురుకుంటారనుకేనే లోగా….

మంత్రి వర్గ విస్తరణ జరిపి యడ్యూరప్ప కుదరుకునారనుకునే సమయంలోనే మరోసారి ఆయనకు కుదుపు తప్పేట్లు లేదు. అధిష్టానం ఆశీస్సులతోనే యడ్యూరప్ప తన పదవిని పదిలం చేసుకోగలిగారు. కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి యడ్యూరప్ప అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి రుచించడం లేదు. అందుకే మరోసారి తమ అసమ్మతిని బహిరంగంగానే వ్యక్తం చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు.

జేడీఎస్ ను చేరదీసి…..

అయితే యడ్యూరప్ప ఈ అసమ్మతి నేతలకు బెదిరే అవకాశం లేదంటున్నారు. నిరంతరం అసమ్మతి పైనే తాను దృష్టి పెట్టేకంటే ప్రత్యామ్నాయం ఆలోచించడం మేలన్న యోచనలో యడ్యూరప్ప ఉన్నారు. జనతాదళ్ ఎస్ ను యడ్యూరప్ప దగ్గరకు తీస్తున్నారు. విధాన పరిషత్ లో అధ్యక్ష స్థానాన్ని జనతాదళ్ ఎస్ కు కేటాయించారు. ఇది అధికార బీజేపీ నేతలకు అస్సలు మింగుడపడటం లేదు. బీజేపీ నేతలు తనపై ఏమాత్రం కాలుదువ్వినా జేడీఎస్ ద్వారా రక్షణ పొందేందుకు యడ్యూరప్ప ఈ రకమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద యడ్యూరప్ప పై కర్ణాటక బీజేపీలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News