బెదిరించారా? బతిమాలారా? ఏంటి ఆ సీక్రెట్?

అందుకే అనుభవం కావాలంటారు. ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా రాజకీయాల్లో అనుభవం ముఖ్యం. సీనియారిటితోనే కీలక పదవులు వరిస్తాయి. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి [more]

Update: 2021-01-26 17:30 GMT

అందుకే అనుభవం కావాలంటారు. ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా రాజకీయాల్లో అనుభవం ముఖ్యం. సీనియారిటితోనే కీలక పదవులు వరిస్తాయి. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సయితం తన అనుభవంతోనే ప్రత్యర్థులకు చెక్ పెట్టగలిగారు. ఇన్నాళ్లూ తనపై ఆగ్రహంతో ఉన్న అధినాయకత్వాన్ని యడ్యూరప్ప ఎలా దారికి తెచ్చుకోగలిగారు? బెదిరించా? బతిమాలా? ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఎంత ప్రచారం చేసినా…?

ఎన్ని వదంతులు.. ఎంత ప్రచారం. మరికొద్ది రోజుల్లో యడ్యూరప్ప దిగిపోతారని కొందరు. ఆయన స్థానంలో వేరే నేతను కూడా అధినాయకత్వం ఎంపిక చేసిందని మరికొందరు ఇలా వ్యాఖ్యానిస్తూ పార్టీని ఇబ్బంది పెట్టారు. అయినా యడ్యూరప్ప సంయమనంతో వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలతో భేటీ అయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇలా అసంతృప్తి పార్టీలో పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఒక్క టూర్ తో….

ఇక అధినాయకత్వం కూడా మాట వినే పరిస్థితిలో లేదు. అందిన నివేదికలను బట్టి యడ్యూరప్పపై గుర్రుగా ఉంది. వయసు బూచిని చూపెట్టి దిగిపోమంటుంది. మంత్రి వర్గ విస్తరణకు నో అంటుంది. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవి ఇవ్వాలన్న యడ్యూరప్ప కోరికకు మోకాలడ్డింది. అయితే యడ్యూరప్ప ఒక్క ఢిల్లీ టూర్ తో మొత్తం సీన్ మారిపోయింది. అప్పటి వరకూ ఢిల్లీ వెళ్లాలని ఎంత ప్రయత్నించినా యడ్యూరప్పకు అపాయింట్ మెంట్ దొరకలేదు. వెళ్లినా కీలక నేతలను కలిసే అవకాశం రాలేదు.

పిలుపు వచ్చేలా….

కానీ ఒక్కసారిగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చేలా యడ్యూరప్ప చేసుకున్నారు. వెళ్లి తన మనసులో మాటను చెప్పారు. అధిష్టానం సరేనంది. తాను అనుకున్నవారికి పదవులు ఇచ్చుకున్నారు. అసంతృప్త నేతలకు తనకు ఎదురులేదని అప్ప చెప్పకనే చెప్పారు. తలెగరేసినా పైచేయి తనదేనన్న సంకేతాలను ఇచ్చారు. ఇప్పుడు మొన్నటి వరకూ బహిరంగంగా విమర్శలు చేసిన అసంతృప్త నేతలు ఇప్పుడు ఢిల్లీ వెళ్లి తమకు పదవులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. మొత్తం మీద యడ్యూరప్ప హైకమాండ్ ను బెదిరించారా? బతిమాలారా? అన్నది పక్కన పెడితే పైచేయి మాత్రం సాధించారు.

Tags:    

Similar News