యడ్డీపై వేటు ఖాయమా?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై అసంతృప్తి మరింత పెరగనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడటంతో అసంతృప్త నేతలందరూ ఢిల్టీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. యడ్యూరప్ప ను ముఖ్యమంత్రి పదవి [more]

Update: 2021-05-14 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై అసంతృప్తి మరింత పెరగనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడటంతో అసంతృప్త నేతలందరూ ఢిల్టీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. యడ్యూరప్ప ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీలోని ఒక వర్గం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత బసవగౌడ యత్నాల్ వంటి నేతలు మే 2వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్ప దిగిపోక తప్పదని చెబుతున్నారు. తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించారు.

ఫలితాలు వెలువడటంతో….

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఇక కేంద్ర నాయకత్వం కూడా కర్ణాటకపై దృష్టి పెట్టనుందని చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ యడ్యూరప్పను కొనసాగిస్తే మరోసారి అధికారంలోకి రావడం కష్టమేనని బీజేపీ కేద్ర నాయకత్వం కూడా భావిస్తుంది. ఇప్పటికే అనేక విషయాల్లో యడ్యూరప్పను పట్టించుకోలేదు. కర్ణాటకలో రాజ్యసభ సభ్యుల ఎంపిక నుంచి ఉప ఎన్నికల్లో అభ్యర్థుల సెలక్షన్ వరకూ ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోయింది.

ఎన్నడూ లేని విధంగా….

అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా యడ్యూరప్ప అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. మంత్రుల్లో కూడా కొందరు యడ్యూరప్ప తీరును బహిరంగంగానే తప్పుపడుతున్నారు. ఏకంగా ఒక మంత్రి గవర్నర్ కే ఫిర్యాదు చేశారు. తమ శాఖల్లో తమకు తెలియకుండానే యడ్యూురప్ప నిధులను విడుదల చేశారని, నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొనసాగిస్తే మరింత డ్యామేజీ…..

మరో వైపు యడ్యూరప్ప కుమారుడుపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మూడేళ్లను యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే పార్టీ మరింత డ్యామేజీ అవుతుందని పార్టీ కేంద్ర నాయకత్వం కూడా భావిస్తుంది. అందుకే యడ్యూరప్పను ఢిల్లీకి పిలిపించి సామరస్య పూర్వకంగానే పక్కకు తప్పుకునేలా చేస్తారన్న టాక్ బలంగా ఉంది. యడ్యూరప్ప మాత్రం చివరి అవకాశాన్ని తనకు వదిలేయాలని కోరుతున్నారు. మరి కొద్దిరోజుల్లో యడ్యూరప్ప భవితవ్యం తేలనుంది.

Tags:    

Similar News