యడ్డీ తర్వాత ఎవరు? ఇదే హాట్ టాపిక్

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తర్వాత నేత ఎవరన్నది అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. అందరికీ ఆమోదయోగ్యమైన నేత కోసం హైకమాండ్ ఇప్పటికే అన్వేషణ ప్రారంభించంది. యడ్యూరప్పూ ముఖ్యమంత్రి [more]

Update: 2021-01-16 17:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తర్వాత నేత ఎవరన్నది అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. అందరికీ ఆమోదయోగ్యమైన నేత కోసం హైకమాండ్ ఇప్పటికే అన్వేషణ ప్రారంభించంది. యడ్యూరప్పూ ముఖ్యమంత్రి పదవిలో పూర్తి కాలం కొనసాగుతారా? లేదా? అన్న విషయం పక్కన పెడితే వచ్చే ఎన్నికలు మాత్రం యడ్యూరప్ప నేతృత్వంలో వెళ్లకూడదన్నది అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. ఆయనకు ధీటైన నేత ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

వేరు చేసి చూడలేం కానీ….

కర్ణాటక బీజేపీని, యడ్యూరప్పను వేరు చేసి చూడలేం. ఒకరకంగా చెప్పాలంటే యడ్యూరప్ప వల్లనే దక్షిణాదిలో ఒక రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరిందని చెప్పాలి. కానీ యడ్యూరప్పకు వయసు మీరింది. ఇప్పటికే 77 వయసులో చేరారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు 80 దాటుతుంది. ఇక ఎన్నికలకు ముందే వేరే వారికి పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయి. యడ్యూరప్పకు ఇప్పటికే ఆ సమాచరం అధినాయకత్వం అందించింది.

అందుకు ధీటైన నేత….

అయితే యడ్యూరప్పకు సమానమైన నేత ఎవరన్నది ఇప్పుడు చర్చగా మారింది. కర్ణాటకలో బలమైన సామాజికవర్గం యడ్యూరప్ప కు అండగా ఉంది. యడ్యూరప్పను చూసే ఇప్పటి వరకూ లింగాయత్ లు బీజేపీకి మద్దతిస్తూ వచ్చారు. యడ్యూరప్ప ను తప్పించి వేరే సామాజికవర్గానికి బాధ్యతలను అప్పగిస్తే వారు బీజేపీకి దూరమయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఆచితూచి అడుగులు వేయాలని అధినాయకత్వం నిర్ణయించింది.

ఫిబ్రవరి నుంచే…..

వచ్చే ఫిబ్రవరి నుంచి యడ్యూరప్పకు ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషణను ప్రారంభించ నున్నారు. 2023 లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈలోగా కొత్త నేత ను నియమించాలన్నది అధిష్టానం ఆలోచనగా ఉంది. కొత్తనేత ఎంపిక కోసం పార్టీ హైకమాండ్ ప్రత్యేకంగా ఒకరికి బాధ్యతను అప్పగించే అవకాశాలున్నాయి. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని ప్రాంతాల నేతల అభిప్రాయాలను తీసుకుని తెలియజేస్తారు. అప్పుడే అధిష్టానం కొత్త నేతను ప్రకటిస్తుందంటున్నారు.

Tags:    

Similar News