అప్పను తప్పించడం ఖాయమా?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను పదవి నుంచి తప్పించడం ఖాయమయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం యడ్యూరప్ప కు పార్టీ కేంద్ర నాయకత్వం ప్రయారిటీ ఇవ్వకపోవడమే. [more]

Update: 2020-09-22 17:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను పదవి నుంచి తప్పించడం ఖాయమయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం యడ్యూరప్ప కు పార్టీ కేంద్ర నాయకత్వం ప్రయారిటీ ఇవ్వకపోవడమే. ఇటీవల కాలంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో పాటు మరో నేత సంతోష్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో యడ్యూరప్పును పదవి నుంచి తప్పించడం ఖాయమని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. కానీ యడ్యూరప్ప వర్గం మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తుంది.

మూడేళ్ల సమయం …..

నిజానికి ఇంకా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్లు గడువు ఉంది. అయితే బీజేపీకి కర్ణాటకలో నాయకత్వ సమస్య ఉంది. దశాబ్దాల కాలం నుంచి కర్ణాటకకు యడ్యూరప్ప నాయకుడిగా ఉన్నారు. మరొకరిని ఎదగనివ్వ లేదు. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా యడ్యూరప్ప సామాజికవర్గం, ఆయన దక్షతను చూసి చూడనట్లు వదిలేసింది. కానీ యడ్యూరప్పకు ఇప్టటికే 70 పదులు వయసు దాటింది. నిబంధనల ప్రకారం ఆయనను తప్పించాల్సి ఉంది.

మిగిలిన రాష్ట్రాల్లోనూ….

యడ్యూరప్పను పదవి నుంచి తప్పించకుంటే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆయన ఎగ్జాంపుల్ గా మిగిలిపోతాడన్న ఆందోళన బీజేపీ కేంద్ర నాయకత్వంలో ఉంది. అందుకోసమే యడ్యూరప్పను తప్పించడం ఖాయమని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తుంది. మరోవైపు యడ్యూరప్ప స్థానంలో మరో నాయకుడు రాష్ట్రంలో ఎదగాలంటే మరొకరికి పదవి ఇస్తేనే సాధ్యమవుతుందని కేంద్ర నాయకత్వం అంచనాలో ఉంది. మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లగలరని భావిస్తుండటమే యడ్యూరప్పను తప్పిస్తున్నారనడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.

ధీమాగానే యడ్యూరప్ప…..

కానీ యడ్యూరప్ప మాత్రం తనను తప్పించే సాహసం అధిష్టానం చేయదన్న ధీమాలో ఉన్నారు. ఇప్పటికీ కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప అనుచరులు బీజేపీలో ఎక్కవగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు సయితం యడ్యూరప్ప పక్షానే నిలుస్తారు. ఎక్కువమంది శాసనసభ్యులు యడ్యూరప్పకే మద్దతిస్తుండటంతో ఆయనను తప్పించే ప్రయత్నాలు అధిష్టానం చేయదన్న విశ్వాసాన్ని ఆయన వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News