అప్పకు టైం కలసిరావడం లేదు.. అన్నీ కష్టాలే

యడ్యూరప్ప కు కష్టాలు తప్పడం లేదు. ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తిని తొలగించేందుకు యడ్యూరప్ప ఇటీవల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. అయితే ఇది కూడా పార్టీలో చిచ్చు [more]

Update: 2020-08-02 18:29 GMT

యడ్యూరప్ప కు కష్టాలు తప్పడం లేదు. ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తిని తొలగించేందుకు యడ్యూరప్ప ఇటీవల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. అయితే ఇది కూడా పార్టీలో చిచ్చు రాజేసింది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా అన్నీ ఎమ్మెల్యేలకే ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. హైకమాండ్ కు ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెరుగుతున్న అసంతృప్తి…..

యడ్యూరప్పపై పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతోంది. ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు కూడా నిర్వహించుకోవడం ఆయనను ఆందోళనలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఎమ్మెల్యేలను సంతృప్తి పర్చడానికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. పార్టీనేతలు, హైకమాండ్ తో చర్చించకుండా 24 మందిని వివిధ పోస్టుల్లో నియమించారు. వీరంతా ఎమ్మెల్యేలే కావడం విశేషం. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీతో చర్చించకుండానే….

ప్రధానంగా బీసీ కమిషన్ నియామకంలోనూ యడ్యూరప్ప నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. బీసీ కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ న్యాయమూర్తి లేదా మాజీ ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉండగా ఈ పదవిని కూడా ఎమ్మెల్యేకు కట్టబెట్టారు. అయితే ఎవరితో చర్చించకుండా పదవులను భర్తీ చేయడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. జిల్లాలో పార్టీ అధ్యక్షులు, కీలకమైన కార్యకర్తలకు ఎవరికీ పదవులను యడ్యూరప్ప ఇవ్వలేదని, తనపై అసంతృప్తి తలెత్తకుండా ఉండేందుకే యడ్యూరప్ప అన్ని పదవులను ఎమ్మెల్యేలకు కేటాయించారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

మంత్రి వర్గ విస్తరణ కూడా….

దీంతో పాటు యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణకు కూడా రెడీ అయ్యారు. ఇంకా యడ్యూరప్ప ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులకు చోటుంది. దీనిపై యడ్యూరప్ప కసరత్తులు చేస్తున్నారు. మంత్రివర్గవిస్తరణకు అనుమతి ఇవ్వాలంటూ అధిష్టానానికి యడ్యూరప్ప ఇప్పటికే లేఖ రాశారు. ఆగస్టు రెండో వారంలోగా మంత్రవర్గ విస్తరణను చేయాలని యడ్యూరప్ప నిర్ణయించుకున్నారు. మరి యడ్యూరప్ప తనపై తలెత్తే అసంతృప్తిని విస్తరణతో అడ్డుకోగలరా? లేదా? అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News