గండికొట్టినట్లేనా?

కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరిగిపోయింది. విపక్షాలు పెట్టుకున్న ఆశలు ఏవీ ఫలించేటట్లు కన్పించడం లేదు. ఈ మంత్రి వర్గ విస్తరణలో పది మందిని మాత్రమే యడ్యూరప్ప [more]

Update: 2020-02-10 18:29 GMT

కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరిగిపోయింది. విపక్షాలు పెట్టుకున్న ఆశలు ఏవీ ఫలించేటట్లు కన్పించడం లేదు. ఈ మంత్రి వర్గ విస్తరణలో పది మందిని మాత్రమే యడ్యూరప్ప కేబినెట్ లోకి తీసుకున్నారు. పదిమంది కూడా అనర్హత వేటు పడి తిరిగి ఉప ఎన్నికల్లో ఎన్నికయిన వారే. కాంగ్రెస్, జేడీఎస్ లలో గెలిచి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన వారికే మంత్రి పదవులు దక్కాయి. బీజేపీ సీనియర్ నేతలను ఈసారి పక్కన పెట్టారు.

మరోసారి విస్తరణలో…..

అయితే మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న సంకేతాలను ఇటు యడ్యూరప్ప, అటు అధిష్టానం పంపింది. బీజేపీ నేతలెవ్వరూ అసంతృప్తికి గురికాకుండా చూసే బాధ్యతను, వారిని బుజ్జగించే పనిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళినికుమార్ కు అప్పగించారు. దీంతో యడ్యూరప్ప పని సులువయింది. తాను అనుకున్నట్లుగానే, హామీ ఇచ్చినట్లుగానే తాను అనుకున్న వారిని మంత్రివర్గంలోకి యడ్యూరప్ప తీసుకోగలిగారు.

కొందరు అసంతృప్తి చెందినా….

ఇక కొందరు సీనియర్ బీజేపీ నేతలు అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయనప్పటికీ, రాష్ఱ్ర అధ్యక్షుడి ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి తాము పడిన కష్టాన్ని చూడకుండా నిన్న గాక మొన్న పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వడమేంటని కొందరు నిలదీసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన వారిని ఎలా విస్మరిస్తామని ఆయన ఎదురుప్రశ్నించినట్లు తెలిసింది.

యడ్డీ ప్రమేయం ఉండదని…..

తర్వాత మంత్రి వర్గ విస్తరణలో చూద్దామని ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలకు నళిన్ కుమార్ హామీ ఇచ్చినట్లు సమాచారం. తర్వాత విస్తరణలో యడ్యూరప్ప ప్రమేయం ఉండదని కూడా ఆయన సీనియర్ నేతలకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో వారు కొంత తగ్గారని చెబుతున్నారు. విస్తరణ తర్వాత అసంతృప్తులు పెరిగి యడ్యూరప్ప ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని భావించిన కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతల ఆశలు అడియాసలయినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News