ఏమి సేతురా లింగా…?

ఇదరి చరిత్ర తేలిపోనుంది. ఇద్దరూ అగ్రనేతలే. అయితే ఇది పరీక్షీ సమయం. కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికలు ఇద్దరు అగ్రనేతలకు అగ్నిపరీక్ష కానున్నాయి. వీటిలో ఏమాత్రం ఫెయిలయినా [more]

Update: 2019-11-22 17:30 GMT

ఇదరి చరిత్ర తేలిపోనుంది. ఇద్దరూ అగ్రనేతలే. అయితే ఇది పరీక్షీ సమయం. కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికలు ఇద్దరు అగ్రనేతలకు అగ్నిపరీక్ష కానున్నాయి. వీటిలో ఏమాత్రం ఫెయిలయినా వారికి రాజకీయ సన్యాసం తప్పదన్న హెచ్చరిక గంటలు మోగుతున్నాయి. కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న సిద్ధరామయ్య, యడ్యూరప్పలు విచిత్రమైన పరిస్థిితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను బట్టే వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నది కాదనలేని వాస్తవం.

యడ్యూరప్పపైనే బాధ్యత….

యడ్యూరప్పనే తీసుకుంటే ఇక్కడ పదిహేను నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతను ఆయనే స్వయంగా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికను కూడా ఆయనే చేసుకున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కాని, రాష్ట్ర నాయకత్వం కాని జోక్యం చేసుకోలేదు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరికి దాదాపుగా టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కానీ వారిని గెలిపించుకునే బాధ్యతకూడా యడ్యూరప్పదే. ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం ఈమేరకు స్పష్టమైన సంకేతాలను పంపింది.

అట్టర్ ప్లాప్ కావాలని….

యడ్యూరప్ప ఈ ఉప ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ కావాలని ఆశించే వర్గం బీజేపీలోనే ఉంది. పదిహేను నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో అసంతృప్తి చోటు చేసుకుని రెబల్స్ గా పోటీ చేసినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. యడ్యూరప్ప స్వయంగా బుజ్జగించినా వారు దిగిరాలేదు. దీంతో ఆయన మఠాధిపతులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయినా రెబల్స్ బెడదను యడ్యూరప్ప బాగానే ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో కనీసం ఎనిమిది స్థానాలు దక్కకపోతే యడ్యూరప్ప ఇక ఇంటి బాట పట్టడమే శరణ‌్యం.

ఫెయిల్ అవ్వాలని….

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిస్థితి కూడా అంతే ఉంది. సిద్ధరామయ్యపై కూడా పార్టీలో అసంతృప్తి తీవ్రంగానే ఉంది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి సిద్ధరామయ్య కారణమే వారు కూడా లేకపోలేదు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో కొందరు నేతలు సిద్ధరామయ్యకు సహకరించడం లేదు. పన్నెండు స్థానాల్లో గెలుస్తామని సిద్ధరామయ్య స్పష్టంగా చెబుతున్నా అంత సీన్ ఎక్కడుందని కాంగ్రెస్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. పీసీీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు తప్పించి సిద్ధరామయ్యకు ఎవరూ సహకరించకపోవడం విశేషం. ఈ మిషన్ లో సిద్ధరామయ్య ఫెయిల్ అవ్వాలని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఇలా యడ్యూరప్ప, సిద్ధరామయ్య లకూ సొంత పార్టీ నుంచే ఇబ్బందులు తలెత్తాయి. వీరిలో ఒకరు మాత్రం ఫెయిల్ కాక తప్పదు. వారికి మాత్రం భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పవు.

Tags:    

Similar News