అప్ప ఇక బిందాస్

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయినా మనశ్శాంతి లేదు. సొంత పార్టీలోనే అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధిష్టానం సయితం తనను పక్కన [more]

Update: 2019-08-24 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయినా మనశ్శాంతి లేదు. సొంత పార్టీలోనే అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధిష్టానం సయితం తనను పక్కన పెట్టింది. తనకు ఫ్రీహ్యాండ్ ఇవ్వకపోవడంతో అసంతృప్తనేతలతో పాటు తనకు అనుకూలంగా ఉన్నవారికి ముఖ్యమంత్రి పదవి చేపట్టినా న్యాయం చేయలేకపోతున్నానన్న బాధను యడ్యూరప్ప తన సన్నిహితుల వద్ద వ్యక్తంచేస్తున్నారు.

సొంత పార్టీ నేతల నుంచే….

మోదీ జమిలీ ఎన్నికలకు వెళితే ఈ పదవి రెండున్నరేళ్లకు మించి ఉండదని యడ్యూరప్పకు తెలియంది కాదు. ఇదే తనకు ఆఖరు పదవి కూడా అని కూడా ఆయనకు తెలియంది కాదు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత చెలరేగిన అసంతృప్తులతో పాటు శాఖల కేటాయింపులో కూడా యడ్యూరప్ప తీవ్రమైన వత్తిడిని సొంత పార్టీ నేతల నుంచి ఎదుర్కొంటున్నారు. కర్ణాటక బీజేపీ నేతలు పార్టీ హైకమాండ్ కు భయపడరన్న విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైంది.

బితుకుబితుకుమంటూ…..

ఇలా బితుకు బితుకుమంటూ పాలన సాగిస్తున్న యడ్యూరప్పకు వైరి పక్షాల్లో జరిగే పరిణామాలు భారీగా ఊరట నిస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. జనతాదళ్ ఎస్ అగ్రనేత దేవెగౌడ, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యల మధ్య వార్ స్టార్టయింది. ఇక రెండు పార్టీలూ కలిసే అవకాశాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ కూడా పార్టీ నేతలను కట్టడి చేసే పరిస్థితుల్లో లేదు.

ఇక కఠినంగా…..

దీంతో ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే అది తమకే లాభమని యడ్యూరప్ప లెక్కేసుకుంటున్నారు. ఆయన లెక్క తప్పు కాకపోవచ్చు. ఇక బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు సయితం క్విక్ డెసిషన్ లు తీసుకునే ఛాన్స్ లేదు. కాంగ్రెస్, జేడీఎస్ లు కలిస్తేనే శాసనసభలో బలం ఉంటుంది. కానీ విడిగా ఉంటే ఫలితం లేదు. దీంతో యడ్యూరప్ప బిందాస్ గా ఉన్నారు. ఆయన ఇక పాలనపై దృష్టి పెట్టే అవకాశముంది. అలాగే అసంతృప్త నేతల విషయంలో కఠినంగా వ్యవహరించే ఛాన్స్ కూడా ఉంది.

Tags:    

Similar News