అప్పకు వైరస్ సెగ బాగానే తగిలేట్లుందే?

కరోనా వైరస్ అధికార భారతీయ జనతా పార్టీలో అసంతృప్తిని రేపింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీలో యడ్యూరప్ప తీసుకుంటున్న నిర్ణయాలను సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా [more]

Update: 2020-04-11 17:30 GMT

కరోనా వైరస్ అధికార భారతీయ జనతా పార్టీలో అసంతృప్తిని రేపింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీలో యడ్యూరప్ప తీసుకుంటున్న నిర్ణయాలను సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఒకవర్గాన్ని వెనకేసుకు రావడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. యడ్యూరప్ప విపక్షాల మాయలో పడిపోయారని సొంత పార్టీ నుంచే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు కొందురు సీనియర్ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసిింది.

పార్టీ నేతల్లోనే….

యడ్యూరప్ప అంటే ఇప్పటికీ పార్టీలో కొందరు నేతలకు ఆగ్రహం ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో పాటు పార్టీకి ఎప్పటి నుంచో వెన్నుదన్నుగా ఉన్న వారిని పక్కన పెట్టడం వంటి వాటిపై వారు కొద్దికాలంగా మండిపడుతున్నారు. కరోనా వైరస్ రాకపోయి ఉంటే మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరిగి ఉండేది. ఈ విస్తరణంలో బీజేపీ సీనియర్ నేతలకు అవకాశం లభించి ఉండేది.

ఒక వర్గం వారిపట్ల….

కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం మర్జక్ మసీదు ప్రార్థనలే. దేశమొత్తం మీద ఇక్కడి నుంచి వచ్చిన వారే ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. ఏ రాష్ట్రమూ దీనికి అతీతం కాదు. అయితే మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిని మతం కోణంలో చూడవద్దని, మానవీయ కోణంలోనే చూడాలని చెప్పారు. అది వారికి చెల్లింది. కానీ బీజేపీకి చెందిన యడ్యూరప్ప విషయంలో మాత్రం అది చెల్లుబాటు కాకుండా పోయింది. మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారిపట్ల యడ్యూరప్ప సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నది బీజేపీ నేతల నుంచి విన్పిస్తున్న మాట.

లాక్ డౌన్ ఎత్తివేతపై….

కొందరు మర్కజ్ కు వెళ్లి వచ్చినా ప్రభుత్వానికి తెలియజేయకపోయినా వారిపై కేసులు నమోదు చేయకపోవడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. యడ్యూరప్ప పదవి కోసమే పాకులాడుతున్నారని పార్టీలో అసంతృప్త నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పది మంది ఇండోనేషియన్లపై యడ్యూరప్ప ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇక కర్ణాటకలో 175 మందికి కరోనా సోకింది. నలుగురు మరణించారు. క్రమంగా లాక్ డౌన్ ను ఎత్తివేసే యోచనలో యడ్యూరప్ప ఉన్నారు. ఇప్పటికే బేకరీలకు అనుమతి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సూచనలతోనే లాక్ డౌన్ క్రమంగా ఎత్తివేయాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. కరోనా ప్రభావం లేని 12 జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తివేసే యోచనలో ఉన్నారు. బెంగళూరు, మైసూరు, బీదర్ వంటి ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. హాట్ స్పాట్ ఏరియాలను మినహాయించి క్రమంగా ఎత్తివేయాలని యడ్యూూరప్ప భావిస్తున్నారు. అలాగే మద్యం దుకాణాలను కూడా రోజుకు మూడు గంటల పాటు తెరిచే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. లాక్ డౌన్ ను డ్రోన్లతో పర్యవేక్షించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Tags:    

Similar News