మోడీ మీద మోజు తీరిపోయిందా… ?

ఇప్పటికి రెండు సార్లు అప్రతిహత విజయాలతో దేశంలో అధికారాన్ని చేపట్టిన ఘనత మోడీది. వరసగా మూడవసారి వస్తే కనుక ఆయన ఏకంగా నెహ్రూ రికార్డునే బద్ధలు కొట్టడం [more]

Update: 2021-08-05 05:00 GMT

ఇప్పటికి రెండు సార్లు అప్రతిహత విజయాలతో దేశంలో అధికారాన్ని చేపట్టిన ఘనత మోడీది. వరసగా మూడవసారి వస్తే కనుక ఆయన ఏకంగా నెహ్రూ రికార్డునే బద్ధలు కొట్టడం ఖాయం. అయితే జాతీయ స్థాయిలో సీన్ చూస్తే అలా లేదు. కానీ మిత్రుల అండతో మళ్ళీ మోడీ వస్తారా అన్న డౌట్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఏపీలో రెండు ప్రధాన పార్టీలూ కూడా ఈ అంశాలనే బేరీజు వేసుకుటూ తమదైన రాజకీయాలకు ఎపుడూ పదును పెడుతూంటాయి. అధికార వైసీపీకి ఆ మధ్య దాకా మోడీ మోజు ఉండేది. ఇపుడు అది ఒక్కసారిగా సడలిపోయింది అంటారు.

సంచలన వ్యాఖ్యలు ….

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ గట్టిగానే నిలబడినట్లుగా చెప్పుకోవాలి. ఆ పార్టీ మీద టీడీపీ నిందలు వేసినా కూడా తన శక్తిమేరకు వైసీపీ ఈ అంశం మీద పోరాడుతోంది. అన్నింటికీ మించి ఉక్కు కార్మికులు వైసీపీని బాగానే నమ్ముతున్నారు. వారికి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు ఇప్పించడంతో పాటు ఢిల్లీ ఉద్యమానికి కూడా పూర్తి మద్దతుగా నిలిచింది. ఇక ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల దాకా ఉక్కు పోరాటాన్ని కొనసాగిస్తే ప్లాంట్ బతికిపోయినట్లే అన్నట్లుగా ఆయన లేటెస్ట్ కామెంట్స్ చేశారు.

ఏడాది పాటు అలా…?

కొద్ది నెలలలో ఎటూ 2021 సంవత్సరం ముగుస్తోంది. ఇక మధ్యలో 2022 ఉంది. ఈ ఏడాది అంతా కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కొనసాగిస్తూ మరో వైపు కోర్టుల ద్వారా స్టే తీసుకువచ్చి ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటే కచ్చితంగా విజయం మనదే అని విజయసాయిరెడ్డి వ్యూహం ఒకటి చెప్పారు. 2023 అంటే కచ్చితంగా ఎన్నికల ఏడాదిగా ఉంటుంది. దాంతో ఉక్కుని 2022లో కాపాడుకుంటే ఇక ఎన్నికల వేళ బీజేపీ సర్కార్ ప్రైవేట్ పరం చేసే సాహసానికి ఒడిగట్టదు అని ఆయన అంటున్నారు. మరి ఇందులో కూడా నిజం ఉంది.

అదేనా అర్ధం …?

సరే 2024 ఎన్నికలు కాబట్టి కొన్నాళ్ళు మౌనంగా ఉన్నా ఆ తరువాత మోడీ మళ్ళీ వస్తే అపుడు స్టీల్ ప్లాంట్ సంగతేంటి. ఇది విజయసాయిరెడ్డి చెప్పలేదు, ఉక్కు కార్మికులు కూడా అడగలేదు. కానీ ఇక్కడే రాజకీయం ఉంది అంటున్నారు. ఈసారి కచ్చితంగా బీజేపీ గెలవదు అన్న అంచనాలతోనే సాయిరెడ్డి ఇలా వ్యూహాన్ని రెడీ చేశారని అంటున్నారు. అంటే 2024లో వచ్చే కొత్త ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని నిలబెడుతుందని ఆయన నమ్ముతున్నారు. మరి ఆయన బలంగా నమ్మే కొత్త ప్రభుత్వం ఏ పార్టీ నాయకత్వంలో వస్తుంది. దానికి ప్రధాని ఎవరు, ఇవన్నీ ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నలే. ఒక్కటి మాత్రం నిజం. వైసీపీ ఆలోచనలు బట్టి చూసుకుంటే పొత్తులతో బీజేపీ మళ్ళీ పవర్ లోకి వచ్చినా మోడీ ప్రధాని అవరు అన్న అంచనాలు కూడా ఉన్నాయట. అందుకే ఇలా ఉక్కు పోరాట వేళ ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ గుట్టు విప్పారనుకోవాలి.

Tags:    

Similar News