టీడీపీకి భారీ షాక్… ఒక ఎమ్మెల్యే.. మాజీ మంత్రి జంప్

వైసీపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్లే కన్పిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో గత మూడు నెలల నుంచి వైసీపీలో చేరికలు లేవు. మార్చి నెల మొదటి [more]

Update: 2020-05-21 03:30 GMT

వైసీపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్లే కన్పిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో గత మూడు నెలల నుంచి వైసీపీలో చేరికలు లేవు. మార్చి నెల మొదటి వారంలో చేరికలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ ను వైసీపీ ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఒక మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేకు వల విసిరింది. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు వారు పడిపోయినట్లు సమాచారం.

ఈ నెల 27వ తేదీన…..

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులకు వైసీపీ వల విసిరింది. మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వీరిద్దరితో ఇప్పటికే చర్చించినట్లు చెబుతున్నారు. ఈ నెల 27వ తేదీన వీరి చేరికకు ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ తరుపున ఎన్నికయ్యారు. వీరిలో ఇప్పటికే కరణం బలరాం వైసీపీకి మద్దతు పలికారు. ఏలూరి సాంబశివరావు కూడా మద్దతు పలికితే ఇక ఇద్దరు మాత్రమే టీడీపీకి ప్రకాశం జిల్లాలో మిగులుతారు.

ఇప్పటికే జిల్లా నేతలు….

ఇప్పటికే ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ నేతలు కరణం బలరాం, పోతుల సునీత, కదిరి బాబూరావులు వైసీపీకి జై కొట్టారు. మాజీ మంత్రి శిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీలపై కూడా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేసి కోట్ల రూపాయల జరిమానా విధించారు. శిద్ధా రాఘవరావు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన వైసీపీలో చేరిక దాదాపు ఖాయమయిందనే చెప్పాలి.

19కి పడిపోయినట్లేనా?

ఇక పర్చూరు నుంచి గెలిచిన ఏలూరి సాంబశివరావు వరసగా రెండు సార్లు విజయం సాధించారు. పర్చూరు నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి దగ్గుబాటి కుటుంబాన్ని వైసీపీ దూరంగా పెట్టింది. ఈ నేపథ్యంలో ఏలూరి సాంబశివరావు వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏలూరి వైసీపీకి మద్దతిస్తే టీడీపీ సభ్యుల సంఖ్య 19కి పడిపోతుంది. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు వీరితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీన వీరిద్దరూ వైసీపీలోకి చేరేందుకు రెడీ అయిపోయారు.

Tags:    

Similar News