సిట్ గుట్టు విప్పితే టీడీపీ గల్లంతే ?

విశాఖ జిల్లాలో ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములను చెరబట్టిన వారి జాతకాలను తేల్చే పనిలో వైసీపీ సర్కార్ ఫుల్ బిజీగా ఉంది. విశాఖను పాలనారాజధానిగా చేశాక జగన్ [more]

Update: 2020-10-31 12:30 GMT

విశాఖ జిల్లాలో ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములను చెరబట్టిన వారి జాతకాలను తేల్చే పనిలో వైసీపీ సర్కార్ ఫుల్ బిజీగా ఉంది. విశాఖను పాలనారాజధానిగా చేశాక జగన్ ప్రతీ చిన్న విషయం మీద పూర్తి దృష్టి సారిస్తున్నారు. ఇంత పెద్ద జిల్లా విశాఖలో తిప్పి తిప్పి కొడితే వంద ఎకరాలు కూడా ప్రభుత్వ భూములు లేకపోవడాన్ని కూడా వైసీపీ సర్కార్ సీరియస్ గానే చూస్తోంది. దీని మీద లోతైన విచారణ జరిపించింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా సిట్ ని నియమించి దందాకు గురి అయిన భూముల లెక్కలను కూడా సరిచూస్తోంది. దాంతో ఏళ్ల కోలదీ భూములను చాపచుట్టేసిన అనేకమంది పెత్తందార్ల బాగోతం ఒక్కసారిగా బయటపడుతోంది అంటున్నారు.

కొరడా ఝలిపిస్తే….

విశాఖ భూములు చాలా విలువైనవి. ఉమ్మడి ఏపీలో కూడా విశాఖ నంబర్ వన్ సిటీగా ఉండేది. దాంతో ఇవాళా నిన్నా అని కాదు, గత కొన్నేళ్ళుగా విశాఖ భూములకు రెక్కలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ గురించి పెద్దగా పట్టించుకున్న వారు లేరు కానీ విభజన తరువాత ఈ సిటీ గురించి ప్రభుత్వం కూడా ఆలోచన చేయడంతో అసలు కధలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి గత అయిదేళ్ళ టీడీపీ పాలనలో అమరావతి రాజధాని పేరిట ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నాడే ఆరోపించింది. దాంతో సమాంతరంగా విశాఖలోనూ పెద్ద ఎత్తున భూ దందాలు చోటు చేసుకున్నాయి. పలుకుబడి కలిగిన పెద్దలంతా కలసి భూములను చక్కబెట్టేసారు అని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా మొత్తానికి మొత్తం లాగేశారు. నాటి సీఎం చంద్రబాబు కూడా సీరియస్ యాక్షన్ ఏదీలేకుండా తూతూమంత్రగా సిట్ వేసి కధ ముగించారు. ఇపుడు వైసీపీ వాటి మీదనే కొరడా ఝలిపిస్తోంది అంటున్నారు.

పెద్ద తలకాయలే….

విశాఖలో ఒక బలమైన సామాజికవర్గం వ్యాపారం పేరిట దశాబ్దాల క్రితమే వచ్చి పాతుకుపోయింది. ఆ సామాజికవర్గం తమ సొంత పార్టీగా టీడీపీని భావించింది. దాంతో రాజకీయ దన్ను కూడా దొరకడంతో విశాఖలో స్థానికేతరుల చేతుల్లోకి వేలాది భూములు వెళ్ళిపోయారని అంటున్నారు. వ్యాపారం కోసం నామమాత్రంపు ధరకు కొంత భూమి తీసుకున్నవారే ఆ చుట్టు పక్కన మిగిలిన ప్రభుత్వ భూములను కూడా చప్పరించేయడంతో విశాఖలో అంగుళం జాగా కూడా సర్కార్ వారి స్థలం లేకుండా పోయిందని అంటున్నారు. ఇపుడు ఏకంగా వైసీపీ ప్రభుత్వ పెద్దల దగ్గరే అక్రమ భూకామందుల లెక్కలన్నీ జాగ్రత్తగా ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఒక్కొక్కరి గుట్టు వరసగా బయటేయడానికి పై లెవెల్ నుంచి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.

ఇదీ ప్లాన్ ….

విశాఖలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ స్థలాలు పెద్దగా లేవు. ఏం చేయాలన్నా ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఖజానా ఖాళీ చేసి మరీ భూములను కొనాల్సిందే. మరి వారి దగ్గర వేల ఎకరాల భూములు ఎలా వచ్చాయంటే అదే తమాషా. ఏ వేలం పాట కూడా లేకుండానే సర్కార్ వారి భూములకు కన్నం పెట్టి మరీ దర్జా చేస్తున్న రాజకీయ వ్యాపారులనే వైసీపీ టార్గెట్ చేసింది. అలా వెనక్కు తీసుకున్న భూములలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యకలాపాలు మొదలెట్టాలని,అభివృద్ధి పనులు చేపట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. దాంతో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ భూములు అందుబాటులోకి వస్తాయన్న మాట. వైసీపీ ఆలోచనలు కనుక సక్రమంగా అమలు అయితే విశాఖలో వేలాది ఎకరాలు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి చేరుతాయి. విశాఖ శరవేగంగా ప్రగతి బాటన నడవడానికి అవసరమైన భూమి కూడా పెద్ద ఎత్తున లభ్యం అవుతుంది. కాగా వైసీపీ చేపడుతున్న తాజ భూ ఆపరేషన్ ని తెలుగుదేశం తప్ప విపక్షాల నుంచి మొత్తం నగర జనాభా అంతా హర్షించడం శుభ పరిణామమే.

Tags:    

Similar News