ఫేక్ సీఎం.. మాక్ అసెంబ్లీ… ?

జనం బ్రహ్మరధం పడితే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. అంతే కాదు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయమే వైసీపీని వరించింది. మరి రెండేళ్ల కాలంలో ఇంతలా [more]

Update: 2021-05-21 13:30 GMT

జనం బ్రహ్మరధం పడితే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. అంతే కాదు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయమే వైసీపీని వరించింది. మరి రెండేళ్ల కాలంలో ఇంతలా మోజు ఒక పార్టీ మీద ఉండడం అంటే మామూలు విషయం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాతం ఫేక్ సీఎం జగన్ అంటూ విమర్శిస్తూంటాయి. జగన్ జనం నుంచి వచ్చిన నేత. పన్నెండేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలలో సవాల్ చేసి మరీ సత్తా చాటిన బహు మొనగాడు జగన్. మరి ఎందుకిలా జగన్ మీద కామెంట్స్ చేస్తున్నారు అంటే అక్కసు తోనే అని అంటారు.

గాలి తీశారా …?

బడ్జెట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవి. అవి ఎన్ని రోజులు సాగాయని కాదు. ఒక ఏడాది పాటు జరిగినా కూడా సమాజంలోని వివిధ వర్గాలకు సంబంధించిన కేటాయింపులు ఎలా ఉన్నాయి. రాష్ట్రం దశ దిశ ఎలా సాగనుంది వంటి వాటి మీద చర్చించే కీలక సమావేశమది. అటువంటి సమావేశాలను బహిష్కరించడం ద్వారా టీడీపీ పెద్ద తప్పే చేసింది అన్నది సొంత పార్టీ భావన. మరో వైపు చూస్తే శాసనసభలో మాట్లాడిన జగన్ తమ ప్రభుత్వ విజయాలను చూసి తట్టుకోలేక ఏకంగా సభకే ముఖం చాటేశారు అంటూ టీడీపీ పెద్దల గాలి తీసేసారు.

అదేందుకు మళ్ళీ …

ఎటూ అసలైన అసెంబ్లీ సమావేశాలకు రాని టీడీపీ మాక్ అసెంబ్లీ అంటూ ఒక నాటకీయ పర్వానికి తెర తీయడమే విడ్డూరం. దాన్ని డ్రామాగా వైసీపీ మంత్రి పేర్ని నాని కూడా విమర్శించారు. మాక్ అసెంబ్లీ నిర్వహించుకోవడం అంటే అసెంబ్లీకి ఇక దూరమైనట్లేనా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. చట్ట సభలలో మాట్లాడే అవకాశం ఉంది. దాంతో పాటు సమస్యల మీద ఎలుగెత్తి చాటేందుకు విపక్షంగా ఒక హోదా ఉంది. అలాంటి పవిత్రమైన బాధ్యతను పక్కన పెట్టి మాక్ అసెంబ్లీ అంటూ టీడీపీ అధినాయకత్వం షో చేయడమేంటి అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

అన్న వారే అలా…?

ఫేక్ సీఎం అంటూ నిత్యం జగన్ని విమర్శించిన వారే చివరికి మాక్ అసెంబ్లీ పెట్టుకొవాల్సి వచ్చిందా అన్న కౌంటర్లు కూడా పడుతున్నాయి. తమ నాయకుడు నిజమైన అసెంబ్లీలో మాట్లాడుతూంటే మాక్ అసెంబ్లీ పెట్టుకుని తమ్ముళ్ళు టైమ్ పాస్ చేస్తున్నారు అంటోంది వైసీపీ. మరి ఎవరు ఫేక్ అన్న మాట కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీని విమర్శించబోయి తామే మాక్ అసెంబ్లీ పెట్టి ఫేక్ మంత్రులు, స్పీకర్లతో కధ నడిపించుకుంటున్నారా అన్న చర్చ కూడా సొంత పార్టీలో ఉందిట. ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు. మా ముఖాలు కూడా చూపించరు అంటూ తెగ ఆవేదన చెందుతున్న అచ్చెన్నాయుడు లాంటి వారు గత అయిదేళ్ల టీడీపీ ఏలుబడిని కూడా గుర్తుకు తెచ్చుకోవాలని వైసీపీ నుంచి మాటలు వచ్చి పడుతున్నాయి. మరి గట్టిగా రెండేళ్ళు కాకుండానే మాక్ అసెంబ్లీకి పరిమితం అయితే మరో మూడేళ్ల పాటు ఆ మీదట కూడా అసెంబ్లీ ముఖం చూసే సీన్ ఉండదేమో తమ్ముళ్ళూ అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News