ఈ కుటుంబం రాజకీయం ముగిసినట్లేనా?

విశాఖ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ద్రోణంరాజు కుటుంబం. ద్రోణంరాజు సత్యనారాయణ నుంచి శ్రీనివాస్ వరకూ విశాఖ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇద్దరి మృతితో ఆ కుటుంబం [more]

Update: 2021-09-03 00:30 GMT

విశాఖ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ద్రోణంరాజు కుటుంబం. ద్రోణంరాజు సత్యనారాయణ నుంచి శ్రీనివాస్ వరకూ విశాఖ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇద్దరి మృతితో ఆ కుటుంబం రాజకీయంగా దూరమయిందనే చెప్పాలి. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం తర్వా త ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. రాజకీయంగా ఆదుకుంటానని చెప్పారు. అయితే ఇటీవల భర్తీ అయిన నామినేటెడ్ పోస్టులకు ద్రోణంరాజు కుటుంబాన్ని జగన్ దూరంగా పెట్టడం చర్చనీయాంశమైంది.

వారసత్వం ఉన్నా…?

ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడిగా ద్రోణంరాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉడా చైర్మన్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనకు జగన్ వీజీటీఎం ఛైర్మన్ పోస్టు కూడా ఇచ్చారు. అయితే ఆయన మరణం తర్వాత శ్రీనివస్ కుమారుడు శ్రీవాత్సవ్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకుంటానని చెప్పారు. చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి వైసీపీలోనే ఉన్నారు. శ్రీవాత్సవ్ చిన్నవాడు కావడంతో రాజకీయంగా ఎవరూ పట్టించుకోవడం లేదు.

నామినేటెడ్ పోస్టుల్లోనూ…?

తాత, తండ్రిలా రాజకీయంగా ఎదగాలని వచ్చిన ద్రోణంరాజు శ్రీవాత్సవ్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో సౌత్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి వచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ద్రోణంరాజు కుటుంబానికి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కడం కష్టమే. దీంతో ద్రోణంరాజు శ్రీవాత్సవ్ కు నామినేటెడ్ పోస్టు ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ జగన్ అనూహ్యంగా ఈ కుటుంబాన్ని దూరం పెట్టారు.

ఇదే ఆఖరి ఛాన్స్…..

ద్రోణంరాజు శ్రీనివాస్ లాగా శ్రీవాత్సవ్ ప్రభావితం చేయలేకపోవడంతోనే పక్కన పెట్టారంటున్నారు. తాత, తండ్రిలా రాజకీయ లౌక్యం, పరపతి లేకపోవడంతో ఆయనకు ఇప్పట్లో రాజకీయంగా అవకాశాలు లభించే వీలు లేదు. అయితే రానున్న ఎమ్మెల్సీ పోస్టుల్లో ద్రోణంరాజు కుటుంబానికి జగన్ స్థానం కల్పిస్తారా? లేదా? అన్నది చూడాలి. అది కూడా మిస్ అయితే విశాఖ రాజకీయాల్లో ఆ కుటుంబం పూర్తిగా కనుమరుగైనట్లే అనుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News