అదే ఎస‌రు పెడుతోందా ? “రెడ్డి” ట్యాగ్ తో ప‌ద‌వుల‌కు ఇబ్బందా ?

క‌ర్నూలు జిల్లాలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అప్పటి వ‌ర‌కు ఉన్న టీడీపీ హ‌వాను తోసి పుచ్చి.. ఇక్కడ వైసీపీ నాయ‌కులు గెలుపు [more]

Update: 2021-02-15 06:30 GMT

క‌ర్నూలు జిల్లాలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అప్పటి వ‌ర‌కు ఉన్న టీడీపీ హ‌వాను తోసి పుచ్చి.. ఇక్కడ వైసీపీ నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరిలో ఒకే కుటుంబాల నుంచి కూడా నాయ‌కులు గెలుపు గుర్రాలు ఎక్కారు. అయితే.. అంద‌రూ జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. అయితే ఏంటి.. ? అంటే. ఇదే వారికి మంత్రి ప‌ద‌వులను దూరం చేసింద‌నే టాక్ వినిపిస్తోంది. పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌గా ఎంతో క‌ష్టప‌డ‌డంతో పాటు దూకుడు చూపించ‌డంతోపాటు బ‌లోపేతం చేసిన నాయ‌కులు త‌మ‌కు కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌ని అనుకుంటారు. కానీ ఇప్పుడు వైసీపీలో ఎలాంటి ప‌ద‌వులు లేని నాయ‌కులు చాలా మందే ఉన్నారు.

శిల్పా కుటుంబానికి…..

ఇప్పుడున్న ప‌రిస్థితిలో ద‌క్కుతాయో లేదో అనే బెంగ‌కూడా వీరిని వెంటాడుతోంది. నంద్యాల‌, శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి శిల్పా చ‌క్రపాణిరెడ్డి, శిల్పా ర‌విచంద్రారెడ్డి విజ‌యం సాధించారు. వీరిలోనూ చ‌క్రపాణ‌ది డిఫ‌రెంట్ స్టయిల్. ఆయ‌న ఎమ్మెల్సీగా టీడీపీలో ఉన్న స‌మ‌యంలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో శిల్పా మోహ‌న్‌రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చింది. దీంతో ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే వ‌దుల‌కుని వ‌చ్చి వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే గ‌త ఎన్నిక‌ల్లో శ్రీశైలం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. దీంతో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నుకున్నారు. నాడు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి మ‌రీ త‌న ప‌ద‌విని త్యాగం చేసినందుకు జ‌గ‌న్ త‌న‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తార‌ని ఆయ‌న ఆశించారు. ఇప్పుడు చక్రపాణికి ఎలాంటి నామినేటెడ్ ప‌ద‌వి కూడా లేదు.

కాటసాని సీనియర్ అయినా….?

ఇక‌, కాట‌సాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 44 వేల భారీ మెజ‌రిటీతో విజ‌యం సాధించారు. వాస్తవానికి ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌డం ఇది ఆరోసారి. ఇక‌, ఆయ‌న సోద‌రుడు కాట‌సాని రామిరెడ్డి బ‌న‌గాన‌ప‌ల్లె నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో త‌మ‌లో రాంభూపాల్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ, వీరికి కూడా మొండి చేయే ద‌క్కింది. మ‌రో విష‌యం చూస్తే.. చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన సొంత అన్నద‌మ్ములు ముగ్గురు.. వైసీపీలో ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. వీరిలో.. ఆదోని, మంత్రాల‌యం, గుంత‌క‌ల్లు(అనంత‌పురం) నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ముగ్గురు అన్నద‌మ్ములు గెలుపు గుర్రాలు ఎక్కారు.

ముగ్గురు బ్రదర్స్…..

మంత్రాల‌యం నుంచి రాంపురం బాల‌నాగిరెడ్డి, ఆదోని నుంచి సాయిప్రసాద్‌రెడ్డి, గుంత‌క‌ల్లు నుంచి వెంక‌ట్రామిరెడ్డి విజ‌యం సాధించారు. వీరు గెల‌వ‌డం, వైసీపీ అధికారంలోకి రావ‌డంతో త‌మ‌కు ఖ‌చ్చితంగా ఇటు క‌ర్నూలు కోటా లేదా అనంత‌పురం కోటాలో మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని లెక్కలు వేసుకున్నారు.కానీ, రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఇన్ని మంత్రి ప‌ద‌వులు ఇస్తే.. బ్యాడ్ సింప్టమ్స్ వెళ్తాయ‌ని భావించిన జ‌గ‌న్ దూరం పెట్టారు. దీంతో ఇప్పుడు వీరంతా ఉసూరు మంటున్నారు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అయినా.. త‌మ‌కు చోటు ద‌క్క‌క పోతుందా? అని ఎదురు చూస్తున్నారు.కానీ.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో క‌ష్ట‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News