వైఎస్సార్ బయోపిక్: యాత్ర మూవీ రివ్యూ

బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్ నటీనటులు: మమ్ముట్టి, అనసూయ, సుహాసిని, జగపతి బాబు, సుధీర్ బాబు, ఆశ్రిత వేముగంటి, రావు రమేష్, పోసాని తదితరులు సినిమాటోగ్రఫీ: సత్యం సూర్యన్ [more]

Update: 2019-02-08 17:35 GMT

బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: మమ్ముట్టి, అనసూయ, సుహాసిని, జగపతి బాబు, సుధీర్ బాబు, ఆశ్రిత వేముగంటి, రావు రమేష్, పోసాని తదితరులు
సినిమాటోగ్రఫీ: సత్యం సూర్యన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్ డైరెక్టర్: కె
ప్రొడ్యూసర్: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
దర్శకత్వం: మహి వి రాఘవ్

ప్రస్తుతం సినిమా రంగంలో బయోపిక్ ల హావ మాములుగా లేదు. క్రీడాకారుడైనా, రాజకీయ నాయకుడైనా, సినిమా నటుడైనా.. చరిత్రలో నిలిచిపోయే పేరున్న వ్యక్తుల బయోపిక్ లు జోరుగా తెరకెక్కుతున్నాయి. కాంట్రవర్సీలకు తావివ్వకుండా బయోపిక్ లను దర్శకనిర్మాతలు తెరకెక్కించేందుకు శతవిధాలా కృషి చేస్తున్నారు. అయితే కాంట్రవర్సీ లేకపోయినా.. సినిమాలో పస ఉండక హిట్ కొట్టలేక కొన్ని చతికిల పడుతుంటే.. సావిత్రి లాంటి నటీమణుల బయోపిక్ లతో మాత్రం హిట్స్ కొడుతున్నారు. ఇక ప్రస్తుతం ట్రెండ్ ని అనుకూలంగా చేసుకుని ఆనందో బ్రహ్మ వంటి హిట్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్.. ఆంధ్ర రాష్ట్రంలో సంచలనాలకు మరు పేరైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రని యాత్ర అనే టైటిల్ తో తెరకెక్కించి నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ వేడి రాజుకుంటున్న సమయంలో రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర అంటే.. ఖచ్చితంగా ఈ సినిమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీ పార్టీకి కి ఆనుకూలంగా ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయినా.. దర్శకుడు మాత్రం అలాంటిదేం లేదు.. ఈ సినిమా మొత్తం రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర మాత్రమే.. ఏ పార్టికి అనుకూలం కాదు.. అలాగే ఏ పార్టీకి ప్రతి కూలం కాదుగా అంటూ స్టేట్మెంట్స్ ఇస్తుండడం చూస్తుంటే.. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. మరి వైఎస్సార్ పాత్రకి దర్శకుడు మహి మలయాళ నటుడు మమ్ముట్టి ని తీసుకోవడం కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా కనబడం.. మమ్ముట్టి కూడా వైఎస్సార్ లా అభినయించడంతో.. యాత్ర సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. మరి ప్రేక్షకుల అంచనాలు ఈ యాత్ర ఎంతవరకు అందుకుంటుందో సమీక్షలో చూసేద్దాం.

కథ:
రాజశేఖర్ రెడ్డి(మమ్ముట్టి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి సమయంలో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటమి తప్పఁదని అనేక సర్వేలు తెలుస్తాయి. ఇక అధిష్టానం కూడా 2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని.. ఇక ఏం చేసిన పార్టీ 2004 ఎన్నికల్లో గెలవదని ఫిక్స్ అయిన టైం లో.. అధిష్టానం అనుమతి లేకుండా రాజశేఖర్ రెడ్డి.. ఆంధ్ర ప్రదేశ్ లో పాద యాత్రకి శ్రీకారం చుడతాడు. ఆ పాద యాత్రలోప్రజల పడే బధాలు, వారికుండే సమస్యలను తెలుసుకుని.. వారి సమస్యలను దూరం చెయ్యడానికి ఒక మ్యానిఫెస్టో ని రెడీ చేసి ఎన్నికలకు వెళ్తాడు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 68 రోజుల పాటు సాగుతుంది. మరి ఈ 68 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో రాజశేఖర్ రెడ్డి రాజకీయనాయకునిగా మొదలై ప్రజల్లో, గుండెల్లో కొలిచే స్థాయికి ఏ విధంగా ఎదగగలిగాడు? ఆ పాద యాత్రలో ప్రజల నుంచి రైతుల నుంచి ఎలాంటి సమస్యలను తెలుసుకున్నాడు? పాద యాత్ర ద్వారా పార్టీని ఎలా అధికారంలోకి తెచ్చాడు? ఆయన కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకునిగా ఎలా ఎదిగాడో? అనేది ఈ యాత్ర సినిమా మెయిన్ కథ.

నటీనటుల నటన:
ఈ సినిమాకి వైఎస్సార్ పాత్రకి మమ్ముట్టిని ఎంపిక చేసుకోవడమే దర్శకుడు కి మొదటి విజయం. మమ్ముట్టి రాజసం, వేషధారణ, మమ్ముట్టి పలికించిన హావభావాలు అన్ని రాజశేఖర్ రెడ్డి ని నిజంగా తెరమీద చూస్తున్నాము అనిపించేలా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి పాత్రకి మమ్ముట్టి 100 పర్సెంట్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. మమ్ముట్టి నటన, అభినయం. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ లో పండించిన నటన సినిమాకే హైలెట్ అనేలా ఉంది. జాలి, ప్రేమ, కరుణ, దయ, పొగరు, లాంటి ఎమోషన్స్ పలికించడమే కాకుండా కొన్ని ఎమోషన్ సీన్లలో కళ్లతో నిర్ణయం చేయడం ఎలాగో చూపించాడు మమ్ముట్టి. వాకింగ్ స్టయిల్ కానివ్వండి, ప్రజలతో మమేకమైన సీన్స్ కానివ్వండి అన్నిటిలో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి ని డామినేట్ చేశాడా అనిపించకమానదు. అసలు ఇంత సోదెందుకు.. మమ్ముట్టి యాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. అయన వన్ మ్యాన్ షో యాత్ర. ఇక వైఎస్ తండ్రి పాత్రలో జగపతి బాబు అలాగే సభితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసినీలు అద్భుత నటనను కనబర్చారు. విజయమ్మ పాత్రకు అశ్రితను, కేవీపీ పాత్రకు రావు రమేష్‌ని తీసుకోవడం కూడా దర్శకుడు చేసిన గొప్ప పని. ఆయా పాత్రల్లో వారి నటన అద్భుతమని చెప్పాలి. మిగతా నటీనటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
ఆనందో బ్రహ్మ లాంటి కామెడీ సినిమాని తెరకెక్కించిన మహి వి రాఘవ్… ఇప్పుడు ఒక పేరున్న, ప్రజల గుండెల్లో కొలువైన రాజకీయనాయకుడు జీవిత చరిత్రని తెర రూపం ఇచ్చాడు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రని యాత్ర అనే టైటిల్ తో సినిమాగా మలిచాడు దర్శకుడు మహి. వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని ఈ యాత్ర సినిమాను తెరకెక్కించాడు. టైటిల్స్‌లోనే వైఎస్సార్ బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ ఎంట్రీ, ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును చెప్పేసిన దర్శకుడు కేవలం పాదయాత్రను మాత్రమే మెయిన్ థీమ్‌గా ఎన్నుకుని పెద్ద ప్రయోగమే చేసాడని చెప్పాలి. అయితే ఫస్టాఫ్ మొత్తం సాఫీగా నడిపిన దర్శకుడు సెకండాఫ్‌లో బలమైన సీన్లను రాసుకున్నాడు. ముఖ్యంగా వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఒక్కో సంక్షేమ పథకానికి ఒక్కో బలమైన కారణాన్ని చాలా ఎమోషనల్ దర్శకుడు చూపించాడు. కాకపోతే సెకండాఫ్ లో అక్కడక్కడా కథ ఎంగేజింగ్ గా సాగుతున్నట్టు అనిపించొచ్చు.దీనిపై దర్శకుడు కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. కానీ ఈ సీన్లు వైఎస్సార్ ను ఎలివేట్ చేసే సీన్ల ముందు తేలిపోతాయి. ఈ సినిమా ద్వారా టిడిపి ని విలన్ ని చేసి వైసీపీ తల్లి పార్టీ అంటే కాంగ్రెస్ ని హైలెట్ చేసి ఉంటారనుకున్నారు. కానీ 2009 ఎన్నికల ముందు సీట్ల కేటాయింపు, కాంగ్రెస్ పార్టీతో వైఎస్ విభేదించిన తీరుని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఒకరకంగా టీడీపీ కంటే కాంగ్రెస్ పార్టీపైనే మెయిన్ విలన్ గా చూపించాడు దర్శకుడు. వైఎస్ చనిపోయిన తరువాత ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు సేకరించి వైఎస్ తనయుడ్ని ముఖ్యమంత్రి చేయాలని పట్టుబట్టినా.. అధిష్టానం జగన్‌ని కాదని రోషయ్యను ఎందుకు ముఖ్యమంత్రి చేసిందన్న ప్రశ్నకు యాత్ర సినిమాతో ఆన్సర్ దొరుకుతుంది. ఇంకా ఈ సినిమాలో ఈ వయసులో ఏ పనీ చేయలేక.. మా పని మేం చేసుకోలేక.. చావలేక బతకలేక మా లాంటి ముసిలోళ్ల కోసం ఏదైనా మంచి పనిచేయయ్యా.. అని ఓ ముసలి అవ్వ దీనంగా వైఎస్సార్ ని అడగటం.. ఆమె మాటలకు చలించిపోయిన వైఎస్.. కళ్లతోనే హావభావాలు పలికిస్తూ ఆ ముసలి అవ్వను దగ్గరకు తీసుకుని భరోసా ఇచ్చిన సీన్ హృదయానికి దగ్గరగా వస్తుంది. ఇక క్లైమాక్స్ లో రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబందించిన క్లిప్పింగ్ తో దర్శకుడు ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు. రాజశేఖర్ రెడ్డి ఫాన్స్ కి ఈ సినిమా మాత్రం మంచి బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి. ఇక మహి వి రాఘవ్ కూడా బలమైన కథతో ఎమోషనల్ గా యాత్ర ని హ్యాండిల్ చేసిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి సంగీతమందించిన కే అటు సాంగ్స్ విషయంలోనూ ఇటు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ బాగానే ఆకట్టుకున్నాడు. యాత్ర లో రెండు ఎమోషనల్ సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా ఆయా సన్నివేశాలను ఎలివేట్ చేసేలా కనబడుతుంది. ఇంకా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీకథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించాడు. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ నిడివి కూడా. నిర్మాతలు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: మమ్ముట్టి నటన, స్టయిల్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఫస్ట్ టు సీన్స్, రెండు పాటలు, క్లైమాక్స్ వైఎస్సార్ ఒరిజినల్ క్లిప్పింగ్స్, నిడివి

నెగెటివ్ పాయింట్స్: సినిమా డాక్యుమెంటరీ ఫీలింగ్, స్లో నేరేషన్, సెంటిమెంట్ సీన్స్ ఎక్కువగా ఉండడం, సెకండ్ హాఫ్

Tags:    

Similar News