ఇక మూలన కూర్చోవడం బెటరేమో అధ్యక్ష్యా?

సీనియర్ నేతలంటే వారి అనుభవాన్ని బట్టి ఉంటుంది. ఎంతకాలం పదవుల్లో కొనసాగామని కాదు. ఎంతగా ప్రజల మన్ననలను పొందామన్నది ముఖ్యం. కానీ పాతతరం రాజకీయ నేతలు కూడా [more]

Update: 2020-04-08 03:30 GMT

సీనియర్ నేతలంటే వారి అనుభవాన్ని బట్టి ఉంటుంది. ఎంతకాలం పదవుల్లో కొనసాగామని కాదు. ఎంతగా ప్రజల మన్ననలను పొందామన్నది ముఖ్యం. కానీ పాతతరం రాజకీయ నేతలు కూడా వారి అనుభవాన్ని పక్కన పెట్టి శకుని పాత్ర పోషిస్తున్నారా? అన్న అనుమానం కలగక మానదు. తెలుగుదేశం పార్టీ కి దాదాపు 37 ఏళ్ల చరిత్ర ఉంది. ఎందరో సీనియర్లు పార్టీలో ఉన్నారు. వారిలో యనమల రామకృష్ణుడు సీనియర్ అనే చెప్పుకోవాలి. అనేక సంక్షోభాలకు ఆయన సాక్షిగా కూడా ఉన్నారు.

కొత్త తరం నేతలు…..

అయితే తెలుగుదేశం పార్టీలో కొత్త తరం వచ్చింది. పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో పాటు అనేక మంది యువనేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన యనమల రామకృష్ణుడు వయసు, అనుభవాన్ని మరిచి చేస్తున్న వ్యాఖ్యలు చూసి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవం ఏమైందన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

ప్రభుత్వ వైఫల్యం అంటూ……

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమయిందని యనమల రామకృష్ణుడు స్టేట్ మెంట్ ఇచ్చారు. పాలకుల ఉదాసీనత కారణంగానే కరోనా రాష్ట్రంలో ఎక్కువయిందని ఆయన మరో ఆరోపణ చేశారు. అయితే ఏ విష‍యంలో విఫలమయిందన్న విషయాన్ని మాత్రం యనమల రామకృష‌‌్ణుడు స్పష్టంగా చెప్పలేకపోయారు. ఏపీలో కరోనా వైరస్ ను ప్రభుత్వం నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. అయినా మర్కజ్ మసీదు ప్రార్థనలకు హాజరై వచ్చిన వారితోనే సంఖ్య ఎక్కువయన సంగతి అందరికీ తెలిసిందే అయినా యనమల రామకృష్ణుడు మాత్రం ప్రభుత్వ వైఫల్యమంటూ సులువుగా చెప్పేశారు.

ఇతర రాష్ట్రాల మాటేమిటి?

మర్కజ్ మసీదు కారణంగా కేవలం ఏపీలోనే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిన సంగతి చూశాం. కానీ ఏపీలోనే కేసులు పెరిగినట్లు యనమల రామకృష్ణుడు చెప్పడంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన సమయం యనమలకు వచ్చేసిందంటున్నారు. వరస ఓటములతో ఆయనకు కొంచెం చపలత్వం కూడా వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. సీనియర్ నేతగా యనమల రామకృష‌్ణుడు ప్రభుత్వాన్ని నిందించే పనిలోనే ఉండకుండా సలహాలు ఇస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

Tags:    

Similar News