ఫాలో…. ఫాలో అంటూ పోలోమని…?

కేసీఆర్ జగన్ లది జిగినీ దోస్త్. ఇద్దరూ ఒకరిని ఒకరు నమ్ముతున్నట్లే ఉంటారు. అలాగే పూర్తిగా కాదు, అలాగనీ వదిలేసి ఎక్కడికీ పోరు. ఇద్దరిదీ విచిత్రమైన స్నేహం. [more]

Update: 2020-03-09 14:30 GMT

కేసీఆర్ జగన్ లది జిగినీ దోస్త్. ఇద్దరూ ఒకరిని ఒకరు నమ్ముతున్నట్లే ఉంటారు. అలాగే పూర్తిగా కాదు, అలాగనీ వదిలేసి ఎక్కడికీ పోరు. ఇద్దరిదీ విచిత్రమైన స్నేహం. రాజకీయ అవసరాలు, అంతకు మించి వ్యక్తిగత అవసరాలూ అందులో ఉంటాయి. వయసులో కొడుకుతో సమానమైన జగన్ కేసీఆర్ రాజకీయాలతో ఎప్పటికపుడు పోటీ పడుతూ తెలంగాణా పెద్దాయన‌కు కొన్ని సార్లు ఎదురొస్తున్నాడు, మరికొన్నిసార్లు ఫాలో ఫాలో అంటున్నాడు. జగన్ పాలనా విధానాలు కొన్ని కేసీఆర్ మెచ్చేలా ఉంటే కేసీఆర్ రాజకీయ నైపుణ్యాలు జగన్ అనుసరించేలా ఉంటున్నాయట.

అచ్చం అలాగే…..

తెలంగాణాలో కేసీఆర్ మొత్తానికి మొత్తం లోకల్ బాడీ ఎన్నికలను గెలుచుకున్నారు. సామ, దాన భేద దండోపాయాలు ఉపయోగించి మరీ వార్డు మెంబర్ నుంచి వదలకుండా బుట్టలో వేసుకున్నాడు. అందుకోసం అధికారాన్ని, రాజకీయాన్ని కలిపి మరీ వాడుకున్నాడు. ఇపుడు అదే జగన్ కి స్పూర్తిగా ఉందిట. ఎట్టిపరిస్థితుల్లో తొంబై శాతం ఫలితాలు మన సొంతం కావాలని జగన్ అందుకే అంటున్నాడు. అక్కడ కేసీఆర్ కి సాధ్యమైంది ఇక్కడ తానూ చేసి చూపించాలానుకుంటున్నాడు. ఇందుకోసం మంత్రులకు గట్టి టార్గెట్లు ఇచ్చాడు, అలాగే ఎమ్మెల్యేలకూ బిజీ పొలిటికల్ వర్క్ అప్పగించారు.

గుక్కతిప్పుకోకుండా…?

ఏపీలో ఇపుడు విపక్షాలు చాలా గందరగోళంలో ఉన్నాయి. అవెంత బేలగా ఉన్నాయంటే ఎన్నికలు కొన్ని నెలలైనా వాయిదా పడితే బాగుండు అనుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే ఇపుడు వీక్ గా ఉంది. జగన్ మాస్టర్ స్ట్రాటజీతో హఠాత్తుగా ఎన్నికలు జరిపించేస్తున్నాడు. కొత్త చట్టం పేరిట జగన్ తీసుకువచ్చిన విధానాలు పూర్తిగా వైసీపీకి ఫలితాలు అనుకూలం అని పచ్చ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మరోవైపు అతి తక్కువ టైం మాత్రమే ఎన్నికలకు ఇచ్చి మొత్తం తంతు పదిహేను రోజుల్లో ముగించడం వెనక జగన్ రాజకీయ చాణక్యం అర్ధమై బీజేపీ సహా ఇతర పార్టీలు బోరుమంటున్నాయి.

ఏకగ్రీవాలే…..

కేసీఆర్ తెలంగాణాలో చాలా మటుకు ఏకగ్రీవాలే చేసుకున్నారు. పెద్ద ఎత్తున మంత్రులను దించేసి వారి ద్వారా సర్పంచుల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు బహుమానాల పేరిట ఏకగ్రీవాలు చేయించుకున్నారు. అదే ఫార్ములాను జగన్ అనుసరిస్తున్నారు. మంత్రులు అపుడే రంగంలోకి దిగిపోయారు. ఇవన్నీ చూసిన తరువాత అనంతపురం నుంచి జేసీ దివాకరరెడ్డి వంటి వారు మేము పోటీ చేసినా దండుగ అంటున్నారు. ఇపుడు తరువాత వంతు కర్నూలు జిల్లాది అట. ఆ విధంగా సీమ జిల్లాల నుంచి మొదలవుతున్నా ఏకగ్రీవాలు ఏపీలోని మెజారిటీ జిల్లాలకు పాకినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి జగన్ టార్గెట్ రీచ్ కావాలను గట్టిగానే ఆలోచన చేస్తున్నాడు. ఇది చూసిన విపక్ష టీడీపీ దాదాపుగా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. చూడాలి మరి ఉనికి కోసమైనా పోరాడుతారో లేదో.

Tags:    

Similar News