ఈయన గారిపై ఉన్నంత… మరెవ్వరిపై లేదట

వైసీపీ ఎమ్మెల్యే కు సొంత పార్టీలోనే పెద్ద ప్రతిపక్షం తయారయింది. టీడీపీ కంటే ఇక్కడ వైసీపీ నేతలే ఆ ఎమ్మెల్యేలకు ప్రధాన శత్రువులుగా మారారు. అధికార పార్టీ [more]

Update: 2020-07-16 14:30 GMT

వైసీపీ ఎమ్మెల్యే కు సొంత పార్టీలోనే పెద్ద ప్రతిపక్షం తయారయింది. టీడీపీ కంటే ఇక్కడ వైసీపీ నేతలే ఆ ఎమ్మెల్యేలకు ప్రధాన శత్రువులుగా మారారు. అధికార పార్టీ వైసీపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైసీపీలో అసంతృప్తులు తలెత్తుతున్నాయి. గూడూరు నియోజకవర్గానికి ఒకప్పుడు హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి వంటి వారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

నియోజకవర్గంలో హేమాహేమీలు….

ఈ నియోజకవర్గంపై ఇప్పటికీ ఆ కుటుంబాల ప్రభావం ఉంది. అయితే ఎస్సీ నియోజకవర్గం కావడంతో 2014 ఎన్నికల్లో వైసీపీ యే గెలిచింది. పాశం సునీల్ కుమార్ వైసీపీ తరుపున గెలిచి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఆయన వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీలు వెళ్లిపోయారు. ఆ తర్వాత గూడూరు నియోజకవర్గంలో ఇన్ ఛార్జి బాధ్యతలను మేరిగ మురళికి అప్పగించారు. ఆయన దాదాపు మూడేళ్ల పాటు పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయగలిగారు. మేకపాటి రాజమోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మేరిగ మురళికి 2019 ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందని అందరూ భావించారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత….

కానీ ఊహించని విథంగా అప్పటి వరకూ తిరుపతి ఎంపీగా పనిచేసిన వరప్రసాద్ కు గూడూరు టిక్కెట్ ను ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంతో గూడూరు నియోజకవర్గంలో మరోసారి వైసీపీ గెలిచింది. అయితే వరప్రసాద్ కు ఏడాది కాలంలోనే అసంతృప్తి మొదలయింది. అప్పటి నుంచి వరప్రసాద్ వైసీపీలోని ఒక వర్గం నేతలను పక్కన పెడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. పనులను కూడా వైసీపీకి పనిచేసిన వారికి కాకుండా వేరే వారికి అప్పగించడం కూడా వారి ఆగ్రహానికి కారణమయింది.

అంతా ఒక్కటై….

వరప్రసాద్ ను వ్యతిరేకిస్తూ పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. వరప్రసాద్ వ్యతిరేకులంతా తిరుపతి ఎంపీ బల్లి దుర్గప్రసాద్ చెంతకు చేరుతున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వరప్రసాద్ వ్యవహరిస్తున్నారని వైసీపీ లోని ఒక వర్గం నేతలు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. జగన్ జిల్లా పర్యటనకు వచ్చి నప్పుడు తేల్చుకుంటామని చెబుతున్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్ కు వ్యతిరేకంగా రెడ్డి సామాజికవర్గం మొత్తం ఇక్కడ ఏకమయిందనే చెప్పాలి. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ గ్రూపుల గోలతో ఎక్కువ నష్టపోయే అవకాశముందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News