వివేకాను ఎవరు హత్య చేశారు…?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య అని తేలడంతో దీని వెనుక ఎవరి హస్తం ఉందన్న అనుమానాలు బయలేదేరాయి. వైఎస్ వివేకానందరెడ్డికి ఎవరితోనూ శతృత్వం లేదు. ఆయన వైఎస్ కుటుంబంలోనే [more]

Update: 2019-03-15 10:45 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య అని తేలడంతో దీని వెనుక ఎవరి హస్తం ఉందన్న అనుమానాలు బయలేదేరాయి. వైఎస్ వివేకానందరెడ్డికి ఎవరితోనూ శతృత్వం లేదు. ఆయన వైఎస్ కుటుంబంలోనే శాంతస్వభావుడిగా పేరుంది. అయితే వైఎస్ వివేకాను హత్య చేయడానికి బలమైన కారణాలు ఏమై ఉంటాయన్నది అర్థం కావడం లేదు. మంత్రిగా పనిచేసినా, ఎంపీగా పనిచేసినా ఆయన ప్రజలతో మమేకమయ్యే వారు. ఎటువంటి రక్షణ లేకుండా కూడా పులివెందుల్లో పర్యటించేవారు. ఆయనకు ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా ఏమీ లేదు.

గుండెపోటు అనుకుని…..

శుక్రవారం తెల్లవారుఝామున వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో విగత జీవుడై పడి ఉన్నారు. ఆయనది తొలుత సహజ మరణం అని భావించారు. గుండెపోటుతో మరణించారని అందరూ అనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక అనంతరం ఆయన శరీరంపై ఏడు చోట్ల గాయాలు ఉండటంతో ఎవరో కావాలని హత్య చేసి ఉంటారని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏడు చోట్ల గాయాలు…..

వైఎస్ వివేకానందరెడ్డిని ఇటీవలే జమ్మలమడుగు పార్టీ కార్యక్రమాలను చూసుకోవాలని పార్టీ ఆదేశించింది. అక్కడ సుధీర్ రెడ్డి పోటీలోకి దిగుతుండటంతో ఆయనకు మద్దతుగా ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి ప్రచారాన్ని కూడానిర్వహించారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్యకు గురికావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. జగన్ కు బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డి వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. ఇప్పటికే వైఎస్ వివేకా మరణంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటుచేసింది. జిల్లా ఎస్పీ కూడా దీనిని హత్యగానే భావిస్తున్నామని, రాత్రి 11.30గంటల నుంచి 5.30 గంటల మధ్య ఏం జరిగిందో విచారిస్తున్నామని చెప్పారు. శరీరంపై ఏడు చోట్ల గాయాలు ఉండటం కూడా హంతకులు ఎక్కడి వారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News