ఒంటరి అయ్యాడు… నియంతలంతా అంతేనేమో?

చైనా ఇప్పుడు ప్రపంచంలో ఒంటరి అయింది. ప్రపంచ మంతా కరోనాతో విలవిలలాడటానికి చైనాయే కారణమన్న నిజాన్ని అన్ని దేశాలు గ్రహించాయి. కేవలం కరోనాతో మరణాలు సంభవించడమే కాకుండా [more]

Update: 2020-07-12 17:30 GMT

చైనా ఇప్పుడు ప్రపంచంలో ఒంటరి అయింది. ప్రపంచ మంతా కరోనాతో విలవిలలాడటానికి చైనాయే కారణమన్న నిజాన్ని అన్ని దేశాలు గ్రహించాయి. కేవలం కరోనాతో మరణాలు సంభవించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలాయి. ఎప్పటికి కోలుకుంటామో తెలియని పరిస్థితి. దీనికి తోడు కరోనా విలయతాండవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమయంలోనే జిన్ పింగ్ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చూడటాన్ని ప్రపంచ దేశాలు అసహ్యించుకుంటున్నాయి. జిన్ పింగ్ నియంతలా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది.

అందరినీ దూరం చేసుకుని…

నిజానికి కరోనా వైరస్ చైనా నుంచి పుట్టింది అని తెలియగానే కొంత ఆందోళన వ్యక్తమయింది. ప్రపంచానికి ఆలస్యంగా తెలియజేయడం వెనక కూడా జిన్ పింగ్ వ్యూహముందటారు. దీంతోనే కరోనా విజృంభించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీనికంతటికీ కారణం చైనాయేనని సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగ విమర్శలే చేశారు. చైనాను వెనకేసుకొచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా ట్రంప్ నిప్పులు చెరిగారు.

కరోనా సమయంలోనూ….

ఇక కరోనా విలయం తాండవం చేస్తుంటే జిన్ పింగ్ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ వ్యాప్తంగా జిన్ పింగ్ పై అసహనం వెల్లువెత్తుతోంది. ప్రపంచ దేశాలన్నీ చైనాకు వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. ప్రధానంగా భారత్ లో కయ్యానికి కాలు దువ్వి జిన్ పింగ్ తన ముప్పును తానే కొని తెచ్చుకున్నారు. ఎప్పటి నుంచో చైనాను నియంత్రించాలన్న ఉద్దేశ్యంతో ఉన్న అమెరికా దీనిని చక్కగా ఉపయోగించుకుంటోంది. జిన్ పింగ్ కు బుద్ది చెప్పాలన్న ఉద్దేశ్యంతో భారత్ కు అమెరికా మద్దతు ప్రకటించింది.

ఏ ఒక్క దేశంతోనూ…..

ఒక్క భారత్ తోనే కాదు అన్ని దేశాలతోనూ జిన్ పింగ్ కయ్యానికి దిగారు. తనకు మిత్రదేశంగా ఉన్న ఫిలిప్పీన్స్ తోనూ గొడవకు దిగారు. అలాగే హాంకాంగ్ వాసులపై చైనా పోలీసుల దాడి పెద్ద రాద్ధాంతమే అయింది. హాంకాంగ్ వాసులకు బ్రిటన్ అండగా నిలిచి చైనాకు వ్యతిరేకంగా పావులు కదిపింది. 30 లక్షలమంది హాంకాంగ్ పౌరులకు ఆశ్రయిస్తామని బ్రిటన్ ప్రకటించడం ఈ సందర్భంగా ప్రస్తవనార్హం. ఇక భారత్ లో ఇప్పటికే చైనా యాప్ లన నిషేధించింది. దీనివల్ల చైనాకు 75 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర దేశాలు కూడా భారత్ బాటలోనే పయనించే అవకాశాలున్నాయి. చైనా పరిశ్రమలను సయితం బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నాయి. మొత్తం మీద జిన్ పింగ్ తాను ఏదో చేయాలనుకుంటే…ఏదో అయినట్లయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు జిన్ పింగ్ ఒంటరివాడని చెప్పక తప్పదు.

Tags:    

Similar News