ఢిల్లీ లింకు గట్టిగా తగులుకుందే?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. ఇందుకు నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనలే ఇందుకు [more]

Update: 2020-03-31 08:00 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. ఇందుకు నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు నిజాముద్దీన్ మర్కాజ్ మసీద్ కరోనా కార్ఖానాలాగా తయారయిందని చెప్పవచ్చు. శ్రీలంక, కజికస్థాన్, మలేషియా, ఆప్ఫనిస్తాన్, ఖబరస్థాన్ వంటి 75 దేశాల నుంచి మసీదు కు వచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామూహిక మతప్రార్థనలు వద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

కా మసీదులో 150 మంది…..

మర్కజ్ మసీదుకు చెందిన మౌలానాకు కూడా ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అయినా మత ప్రార్థనలను జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ ప్రార్థనలకు ఎనిమిది వేల మంది హాజరయినట్లు తెలిసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఈ ప్రార్థనలు ఈ మసీదులో జరిగాయి. వీరంతా 16వ తేదీ నుంచి ఎవరి ఇళ్లకు వాళ్లు చేరుకున్నారు. కొందరు మత గురువులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

వారికే ఎక్కువగా వైరస్….

రెండు తెలుగు రాష్ట్రాల్లో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికే కరోనా వైరస్ సోకిందని తెలియడంతో దేశ వ్యాప్తంగా అప్రమత్తం చేశారు. ఇప్పటికే మసీదులో ఉన్న 150 మందిని క్వారంటైన్ కు ఢిల్లీ పోలీసులు తరలించారు. దేశ వ్యాప్తంగా ఈ ఎనిమిది వేల మంది ఎక్కడెక్కడకు వెళ్లారు? ఎలా వెళ్లారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొందరు బస్సుల్లోనూ వెళ్లినట్లు తెలుస్తోంది. రైలు ప్రయాణాల విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

స్వచ్ఛందంగా రావాలని…..

దేశ వ్యాప్తంగా మర్కాజ్ మసీద్ ప్రార్థనలు ఆందోళన కల్గిస్తున్నాయి. స్వచ్ఛందంగా ప్రార్థనల్లో పాల్గొన్న వారు ప్రభుత్వానికి వివరాలను తెలియజేయాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ప్రార్థనల్లో పాల్గొన్న వారే ఎక్కువగా మరణించడంతో ప్రభాత్వాలు ట్రాకింగ్ చేస్తున్నాయి. వీరందరిని ఎంత త్వరగా గుర్తించగలిగి క్వారంటైన్ కు తేల్చగలిగితేనే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా ప్రజల నుంచి సహకారం ఈ విపత్కర సమయంలో అవసరం అన్నది గుర్తించాలి.

Tags:    

Similar News