బెట్టింగ్ ల కోసమే ఐపిఎల్ …?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ తో వణుకుతుంది. అయినా కానీ దేశం కాని దేశం దుబాయి లో హడావిడిగా ఐపిఎల్ ను మొదలు పెట్టేశారు. పైగా స్టేడియం [more]

Update: 2020-10-19 09:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ తో వణుకుతుంది. అయినా కానీ దేశం కాని దేశం దుబాయి లో హడావిడిగా ఐపిఎల్ ను మొదలు పెట్టేశారు. పైగా స్టేడియం లో ఒక్క ప్రేక్షకుడు లేకుండా కేవలం టివి ప్రసారాలతోనే ఆట మొదలు పెట్టేశారు. దీనికి ఎన్నో వ్యయప్రయాసలకు ఒడిదుడుకులను సైతం బిసిసిఐ ఎదుర్కొంది. అయినా కానీ అనుకున్నట్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను విదేశీ గడ్డపై నిర్వహించేస్తుంది.

బెట్టింగ్ లలో దొరుకుతున్న…

ఇంత హడావిడిగా ఐపీఎల్ నిర్వహణపై అనేక అనుమానాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా బెట్టింగ్ లపై సాగుతున్న పోలీస్ దాడుల్లో దొరుకుతున్న కోట్ల రూపాయలే సమాధానం చెబుతుంది. ప్రభుత్వాలు నియంత్రించలేని స్థాయికి బెట్టింగ్ మాఫియా చేరుకోవడమే దీనికి కారణంగా తెలుస్తుంది. విదేశాల్లో ఉంటూ భారత్ లో క్రికెట్ బెట్టింగ్ ల ద్వారా వేలకోట్ల రూపాయలు దావుద్ ఇబ్రహీం వంటివారు ఆర్జిస్తున్నారని ఇప్పటికే ఇంటిలిజెన్స్ నివేదికలు ఒక పక్క చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

లోథా కమిటీ చట్టబద్ధం చేయమన్నా…

హైదరాబాద్ లో పోలీసులు చేసిన ఒక చిన్న రైడ్ లో ఐపీఎల్ మ్యాచ్ లను వేదికగా చేసుకుని 16 కోట్ల రూపాయలు దొరికాయి. ఇంకా రైడ్స్ సరిగ్గా జరిగితే వందలు, వేలకోట్ల రూపాయల బెట్టింగ్ రాకెట్స్ బయటపడతాయి. ఇవన్నీ గమనించే గతంలో 2013 లో మ్యాచ్ ఫిక్సింగ్, ఆ తరువాత బెట్టింగ్ ఆరోపణలపై సుప్రీం కోర్ట్ 2016 లో లోథా కమిషన్ ను నియమించింది. ఇందులో జస్టిస్ ఆర్ రవీంద్రన్, జస్టిస్ అశోక్ భాను లతో కూడిన కమిషన్ ఒక నివేదికను సుప్రీం కి అందజేసింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులో ముఖ్యమైనది దేశంలో క్రికెట్ బెట్టింగ్ ను చట్టబద్ధం చేయమని చెప్పడం గమనార్హం.

అరికట్టలేని పరిస్థితుల్లో……

అరికట్టలేని పరిస్థితుల్లోకి బెట్టింగ్ మాఫియా వేళ్లూనుకోవడంతో కొన్ని దేశాల్లో మాదిరే ఇక్కడ కూడా చేయాలని కమిషన్ సూచించింది. తద్వారా ఇంగ్లాండ్ వంటి దేశాల్లోని ప్రయివేట్ బెట్టింగ్ కంపెనీలు భారత్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు సైతం ఆదాయం లభించడం తో బాటు చట్టబద్ధం కావడం వల్ల బెట్టింగ్ మాఫియా దూకుడుకు చెక్ పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News