డబ్ల్యుహెచ్ఓ ఎందుకిలా ….?

ప్రపంచాన్ని కరోనా పై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో విఫలం అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మాత్రం చిత్రమైన హెచ్చరికలు చేస్తుంది. వ్యాక్సిన్ తయారీ పై [more]

Update: 2020-08-05 18:29 GMT

ప్రపంచాన్ని కరోనా పై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో విఫలం అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మాత్రం చిత్రమైన హెచ్చరికలు చేస్తుంది. వ్యాక్సిన్ తయారీ పై ఇప్పటికే ప్రపంచంలో 150 కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందులో ఆరు నుంచి ఎనిమిది దేశాలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ పై అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యు హెచ్ ఓ కరోనా కు ఏ వ్యాక్సిన్ పనికిరాదంటూ ప్రకటించడమే కాదు దశాబ్దాల తరబడి కరోనా కొనసాగుతోందంటూ పేర్కొంది. అదే ఇప్పుడు అందరిలో మరిన్ని అనుమానాలు పొడచూపేలా చేస్తున్నాయి.

ఎవరి ప్రయోజనాలకోసం … ?

ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా నేరుగా యుద్ధం మొదలు పెట్టింది. కరోనా పై ముందస్తు హెచ్చరికలు చేయడంలో ఆ సంస్థ విఫలం కావడంతో బాటు చైనా ప్రయోజనాలకు అనుగుణంగా నడుస్తుందంటూ యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగానే ధ్వజం ఎత్తారు. అంతే కాదు యు ఎస్ నుంచి డబ్ల్యు హెచ్ ఓ కు అందించే నిధులను నిలిపేశారు ట్రంప్. ఇప్పుడు యు ఎస్ నిర్ణయం సరైందనే వాదన ప్రపంచంలో మెజారిటీ దేశాలు అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా మాస్క్ లు భౌతిక దూరం, శానిటైజర్ లు, టెస్టింగ్, ట్రేసింగ్ లు మాత్రమే కరోనా కట్టడికి మన ముందు ఉన్న మార్గాలంటు డబ్య్లు హెచ్ ఓ చెప్పింది. వ్యాక్సిన్ లు ఏవీ పనికిరాదని ఆ సంస్థ చేసిన ప్రకటన ఏ పరిశోధన తో ఇది చెప్పిందో వెల్లడించకపోవడం గమనార్హం.

చైనా లో కట్టడి ఎలా సాధ్యం …?

కరోనా పుట్టిన చైనా లో ఇప్పటికి కేసులు వందలోపే అదీ పదుల సంఖ్యలో మాత్రమే నమోదు అవుతున్నట్లు ఆ దేశం ప్రకటిస్తుంది. ఇదే అందరిలో ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న ఈ వైరస్ అక్కడ ఎలా అణగి ఉంది దీనికి కారణాలు ఏమిటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయో వార్ లో భాగంగా వైరస్ ను ఉత్పత్తి చేసి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ను ప్రజల ప్రాణాలను తీస్తున్న ఈ మహమ్మారి ని అడ్డుకునే మందు చైనా దగ్గర ఉందని అందుకే అక్కడ కంట్రోల్ లో ఉందని ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ విషయాన్నీ పరిశోధించి వెలుగులోకి తేవడం మాని ప్రపంచ మానవాళిని మరింత భయోత్పాతానికి డబ్ల్యు హెచ్ ఓ గురిచేయడం మరోసారి ఆ సంస్థపై విమర్శలను, ఆరోపణలను పెంచుతుంది.

Tags:    

Similar News