ట్రంప్ చెప్పింది నిజమే… ఏం ఒరగబెట్టారు?

యావత్ ప్రపంచం కరోనా ప్రభావంతో తలకిందులవుతున్న నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (who) పాత్ర చర్చనీయాంశమైంది. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లో ఆ సంస్ధ ప్రజలు ఆశించిన మేరకు [more]

Update: 2020-05-22 16:30 GMT

యావత్ ప్రపంచం కరోనా ప్రభావంతో తలకిందులవుతున్న నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (who) పాత్ర చర్చనీయాంశమైంది. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లో ఆ సంస్ధ ప్రజలు ఆశించిన మేరకు పని చేస్తుందా? తన లక్షాలు, విధి విధానాల్లో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవడం సహజం. ప్రపంచాన్ని పీడించే, వేధించే, వ్యాధులు, నివారణలో సంస్ధ పాత్రపై వివిధ కోణాల్లో చర్చ జరగడం సహజం. అయితే ప్రతిపాదిత లక్షసాధనలో ఈ అంతర్జాతీయ సంస్ధ ఆశించినంత మేరకు విజయవంతం కాలేదని, విమర్శలకు గురైందన్న అభిప్రాయం నెలకొంది. ముఖ్యంగా కరోనా వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తంచేయడం, నివారణ చర్యలు చేపట్టడం, దేశాలను సమన్వయ పర్చడంలో విఫలమైందని చెప్పకతప్పదు.

టెడ్రోస్ పైనే గురి…..

ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధినేత అయిన డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధొనామ్ వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. ఆఫ్రికాఖండంలోని ఇధియెాపియెాకు చెందిన టెడ్రోస్ చైనాకు అనుకుాలంగా వ్యవహరించడం, రాగల ముప్పును ముందుగా గుర్తించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇధియెాపియెా వైద్యఆరోగ్య, విదేశాంగశాఖలు ముఖ్యంగా టెడ్రోస్ ప్రస్తుతం ఈ విషయంలో అగ్రరాజ్యమైన అమెరికా నుంచి విమర్శల దాడిని ఎదుర్కొంటున్నారు. అసలు కనీసం వైద్యుడయినా కాని టెడ్రోస్ చైనా లాబీయింగ్ తోనే ప్రపంచఆరోగ్య సంస్ధ పీఠాన్ని అధష్టించారన్న ఆరోపణలు లేకపోలేదు. తమ దేశంలో చైనాకు అనుకూలంగా పావులు కదిపారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. చైనాలోని వూహాన్ లో కరోనా వెలుగు చూశాక అది ఇతర దేశాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో, అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని చెప్పక తప్పదు. అందుకే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు నిలిపివేశారు.

చెల్లింపు పరంగా…..

1948 ఏప్రిల్ 7 ఆవిర్భవించిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రపంచదేశాలు, స్వచ్ఛంద సంస్ధలు ఇచ్చే విరాళాలతో నడుస్తోంది. మెుత్తం బడ్జెట్ లో 15 నుంచి 18 శాతం వెుుత్తాన్ని అమెరికా సమీకరిస్తోంది. ఇదే అత్యధిక మెుత్తం. తరువాత స్ధానాల్లో బిల్ గేట్స్ మిలిందా గేట్స్ ఫౌడేషన్ ఉన్నాయి. 160 కోట్ల జనాభా, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన చైనా సమకూర్చేది కేవలం 0.3 శాతం మాత్రమే కావడం గమనార్హం. చెల్లింపు పరంగా చుాస్తే చైనా 21 వ స్ధానంలో ఉంది. భారత్, పాక్, బీజింగ్ చెల్లించేది తక్కువే. చెల్లింపుల విషయంలో చైనా, ముఖ్యంగా ఉన్న తమదేశంలో పెట్టుబడులు పెట్టారని, తన ఎంపికలో మద్దతు ఇచ్చిందన్న ఉద్దేశంతో టెడ్రోస్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నరన్నది అమెరికా అధినేత ట్రంప్ అభిప్రాయం. అందుకనే దాదాపు రుా.3,833 కోట్ల సాయాన్ని ఆయన తక్షణం నిలిపివేశారు. పెద్ద దేశం అయినప్పటికీ చైనా కేవలం రుా.300 కోట్లనే కేటాయిస్తుందని ట్రంప్ గుర్తుచేశారు. వూహన్ అనుభవంతో అప్రమత్తం చేసి ఉంటే పరిస్ధితి ఇంతవరకు వచ్చేది కాదన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చలేం. టెడ్రోస్ ఎంత సమర్ధించుకున్నప్పటికీ ఈవిషయంలో ఆయన పాత్రపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికా నిధుల నిలిపివేతలో చైనా తక్షణం స్పదించడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు రుా.228 కోట్ల అదనపు సాయాన్ని ప్రకటించడం విశేషం. ఆ దేశ విదేశాంగ మంత్రి జంగ్ ఘమాంగ్ బీజింగ్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే చైనా రుా.152 కోట్ల సాయాన్ని అందచేసింది. 1948 జులై 24 ప్రపంచ ఆరోగ్య సంస్ధ తొలిసమావేశం జరిగింది. పొలియెా, మలేరియా, ఎయిడ్స్, ఎబోలె, క్యాన్సర్, చికెన్ గున్నియా వంటి మహమ్మారిలను ఎదుర్కోవడంలో సమర్ధవంతంగా వ్యవహరించింది. ప్రపంచ ఆరోగ్యసంస్ధ కరోనా విషయంలో చతికిలపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రంపంచ జనాభా, ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఈ అంతర్జాతీయ సంస్ధ ఇకనైనా చురుకైన పాత్ర పోషించాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News