వరల్డ్ కప్ లో అదే కీలకం …!!

ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంటుంది. అన్ని జట్లు గత నెలరోజులుగా హోరాహోరీగా తలపడ్డాయి. లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన నాలుగు జట్లకు సెమి ఫైనల్ [more]

Update: 2019-07-03 00:30 GMT

ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంటుంది. అన్ని జట్లు గత నెలరోజులుగా హోరాహోరీగా తలపడ్డాయి. లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన నాలుగు జట్లకు సెమి ఫైనల్ లో ఆడే ఛాన్స్ దక్కుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఎనిమిది మ్యాచ్ లలో ఏడింటి లో విజయం సాధించి సెమిస్ కి వెళ్లిన తొలి జట్టు అయ్యింది. ఇక సెమిస్ బెర్త్ కోసం వెయిటింగ్ లో వున్న జట్లలో ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వున్నాయి. వీరిలో ఇండియా కు దాదాపు బెర్త్ ఖాయమైనట్లే. ఒక్క పాయింట్ సాధిస్తే నేరుగా సెమిస్ చేరుకుంటుంది. ఇక న్యూజిలాండ్ ది అదే పరిస్థితి. ఒక్క పాయింట్ కి దూరంలో ఆ టీం వుంది. మరొక్క మ్యాచ్ ఆడాల్సి వుంది. అది కూడా బలమైన ఇంగ్లాండ్ టీం తో ఈ రెండు జట్ల లో ఎవరు గెలిచినా సెమిస్ కి నేరుగా వెళతారు. ఓడిన టీం రన్ రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు ఉంటాయి.

వారిద్దరికి చావో రేవో ….

ఇంగ్లాండ్ కి అయితే న్యూజిలాండ్ తో మ్యాచ్ చావో రేవో. ఆ టీం పదిపాయింట్లతో నాలుగోస్థానంలో ప్రస్తుతం కొనసాగుతుంది. రన్ రేట్ లో లోను ఒక్క పాయింట్ తేడాతో న్యూజిలాండ్ కన్నా వెనుకబడే వుంది. ఆఖరి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో గెలవక తప్పని పరిస్థితి. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పై గెలవకపోతే పాకిస్తాన్ సెమి ఫైనల్స్ ఆశలకు జీవం పోసినట్లే. న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం ప్రస్తుతం 9 పాయింట్ల తో మరో మ్యాచ్ ఆడాలిసిన పాక్ తన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడిస్తే పాయింట్ల ఆధారంగా సెమిస్ కి చేరిపోతుంది. ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాలిసిందే.

చివరి ఆశలు……

బంగ్లాదేశ్ కి ఆశ మిణుకు మిణుకు మంటుంది. బలమైన ఇండియా, పాకిస్థాన్ లపై గెలిస్తే ఆ టీం సెమి ఫైనల్స్ చేరే ఛాన్స్ ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కీలకం కానుంది. నెట్ రన్ రేట్ లో ఆస్ట్రేలియా తో సమానంగా ఇంగ్లాండ్ దూసుకుపోతుంది. పాక్ రన్ రేట్ లో బాగా వెనుకబడే వుంది. ప్రస్తుతం చివరి అంకం లో సాగే మ్యాచ్ లలో ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఆ మ్యాచ్ లో గెలుపు ఓటములు ఆ టీం లు సెమిస్ చేరే ఛాన్స్ తో బాటు పాకిస్తాన్ సెమిస్ కు చేరేది లేనిది తేల్చే మ్యాచ్ కావడం విశేషం.

Tags:    

Similar News