వీరి అడ్రస్ చెప్పరూ…?

టీడీపీలో చిత్రమైన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ పార్టీకి గ‌తంలోను ఇప్పుడు కూడా మ‌హిళా ప్రజాప్రతినిధులు అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయ‌ల సీమ‌ల నుంచే ఉన్నారు. కృష్ణా, [more]

Update: 2020-01-29 00:30 GMT

టీడీపీలో చిత్రమైన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ పార్టీకి గ‌తంలోను ఇప్పుడు కూడా మ‌హిళా ప్రజాప్రతినిధులు అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయ‌ల సీమ‌ల నుంచే ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి మ‌హిళా నేత‌లు పెద్దగా లేరు. గ‌తంలో ఇక్కడ నుంచి గెలిచిన దాఖ‌లాలు కూడా త‌క్కువే. దీంతో ఇప్పుడు మాజీలే అయినా ఏ ఒక్క మ‌హిళా నేత కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజ‌ధాని స‌మ‌రానికి చేతులు క‌ల‌ప‌డం లేదు. వాస్తవానికి ఎన్నిక‌ల‌కు ముందు అంద‌రూ జ‌గ‌న్‌ను విమ‌ర్శించారు.

వారి వాయిస్ లేదే…?

శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఇంచార్జ్ గౌతు శిరీష‌, శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీక‌ర్ ప్రతిభాభార‌తి వంటివారు దూకుడుగా ఉండేవారు. అదేవిధంగా క‌ర్నూలు నుంచి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స‌హా అనంత పురం నుంచి ఎమ్మెల్సీ శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కుమార్తె యామినీ బాల, మాజీ మంత్రి ప‌రిటాల సునీత వంటివారు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అయితే, ఇప్పుడు వీరంతా కూడా మౌనం దాల్చారు. ఏ ఒక్కరూ కూడా పార్టీ త‌ర‌పున గ‌ట్టిగా వాయిస్ వినిపించే ప‌రిస్థితి లేకుండా పోయింది.

సంకట స్థితిలో….

విశాఖను రాజ‌ధాని చేస్తే.. అభివృద్ధి చెందుతుంది కాబ‌ట్టి.. మూడు రాజ‌ధానుల ప్రతిపాద‌నను వ‌ద్దంటే రాజ‌కీయంగా ఇబ్బంది త‌ప్పద‌ని ఇక్కడి వారు మౌనం వ‌హించారు. ఇక‌, సీమ ప్రాంత అభివృద్ధి విష‌యంలో ఇక్కడి వారు హైకోర్టు వస్తే..ఫ‌ర్వాలేద‌ని, ఇప్పటి వ‌ర‌కు ఏ ప్రభుత్వం కూడా శ్రీబాగ్ ఒప్పందంపై దృష్టి పెట్టిందేలేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌ధానులను వ్యతిరేకిస్తున్న టీడీపీన నేత‌లకు సంక‌ట స్థితి ఏర్పడింది.

వ్యతిరేకంగా విన్పిస్తే…..

ఉత్త‌రాంధ్రలో వైజాగ్ విష‌యంలో గౌతు శిరీష సైతం మౌనం దాలుస్తున్నారు. పార్టీ స్టాండ్‌కు అనుకూలంగా మాట్లాడితే త‌న‌కు వ్యతిరేక‌త ఎక్కడ వ‌స్తుందో ? అని ఆమె మాట్లాడ‌డం లేదు. ఇక పార్టీ త‌ర‌పున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వానీ సైతం మౌనంగానే ఉంటున్నారు. మ‌రో వైపు వైసీపీ నుంచి గెలిచిన 25 మంది మ‌హిళా ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు స‌భ‌లోనూ, బ‌య‌టా పార్టీ వాయిస్ బ‌లంగా వినిపిస్తూ దూసుకు పోతున్నారు.

ఉద్యమం జరిగినా…..

ఏదో దివ్యవాణి లాంటి వాళ్లు అర‌కొరా రాజ‌ధాని ఉద్యమంలో ఫైట్ చేస్తూ మాట్లాడుతున్నా అవి జ‌నాల‌కు ఎక్కడం లేదు. ఇక కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, ఉప్పులేటి క‌ల్పన ఇద్దరూ ఎక్కడ ఉన్నారో తెలియ‌ని ప‌రిస్థితి. పాయ‌క‌రావుపేట మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత మాత్రం అప్పుడ‌ప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి ఒకటీ అరా కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఏదేమైనా అమ‌రావ‌తి కోసం పార్టీ త‌ర‌పున నేత‌లు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా మ‌హిళా నాయ‌కులు ఎవ‌రూ కూడా ముందుకు వ‌చ్చి త‌మ వాద‌న‌ను కానీ, టీడీపీ వాయిస్‌ను కానీ వినిపించ‌లేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News