హిస్టరీ బాగానే ఉన్నా…?

అవును! ఇప్పుడు కొంద‌రు మ‌హిళా నాయ‌కులు త‌మ ఉనికి కోసం టీడీపీలో పాకులాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది ఒక‌ప్పుడు వీరంతా యాక్టివ్‌గా ఉన్నవారే. పార్టీని ముందుకు న‌డిపించిన వారే. [more]

Update: 2019-08-25 06:30 GMT

అవును! ఇప్పుడు కొంద‌రు మ‌హిళా నాయ‌కులు త‌మ ఉనికి కోసం టీడీపీలో పాకులాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది ఒక‌ప్పుడు వీరంతా యాక్టివ్‌గా ఉన్నవారే. పార్టీని ముందుకు న‌డిపించిన వారే. కీల‌క‌ ప‌ద‌వులు కూడా అనుభ‌వించిన వారే. అయితే, వృద్ధులు కావ‌డంతో వీరు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపారు. అయితే, స‌ద‌రు వార‌సులు రాజ‌కీయాల్లో గుర్తింపు తెచ్చుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దీంతో పురుష నాయకుల‌తో స‌మానంగా త‌మ‌కు కూడా రాజ‌కీయాల్లో శాశ్వత గుర్తింపు వ‌స్తుంద‌ని ఆశించిన ఈ మ‌హిళా నాయ‌కురాళ్లు ఇప్పుడు ఉనికికోసం పాకులాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

సీనియర్ నేతలయినా….

విష‌యంలోకి వెళ్తే.. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ స్పీక‌ర్ ప్రతిభా భార‌తి, అనంత‌పురానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ.. శ‌మంత‌క‌మ‌ణి, నెల్లూరుకు చెందిన కుతూహ‌ల‌మ్మ, గుంటూరుకు చెందిన మాజీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్సన్ న‌న్నప‌నేని రాజ‌కుమారి టీడీపీలో కీల‌కంగా రాజ‌కీయ తెర‌మీద క‌నిపిం,ారు. వీరంతా అనేక రూపాల్లో రాజ‌కీయాల్లో చ‌రిత్రను సృష్టించారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క హిస్టరీ ఉంది. వీరిలో కుతూహ‌ల‌మ్మ మాత్రం చాన్నాళ్లు కాంగ్రెస్‌లో ఉండి.. విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలోకి వచ్చారు. ఇక‌, వీరు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పోటీ చేసే అవ‌కాశం లేదు.

వారసులను రంగంలోకి….

అస‌లా మాట‌కొస్తే.. ఇప్పటికే రాజ‌కుమారి, కుతూహ‌ల‌మ్మ, శ‌మంత‌క‌మ‌ణి, ప్రతిభాభార‌తిలు పోటీకి దూరంగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే వీరంతా త‌మ వార‌సులుగా కుమార్తెల‌ను, కుమారుల‌ను రంగంలోకి దింపారు. 2009, 2014, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయించారు. అయితే, వీరంతా కూడా ఓట‌మిపా ల‌య్యారు. ఒక్క శ‌మంత‌కమ‌ణి కుమార్తె యామినీబాల మాత్రం విజ‌యం సాధించారు. అయితే, త‌ర్వాత కాలంలో త‌ల్లితోనే ఆమె విభేదించార‌ని అంటున్నారు. దీంతో ఆమె త‌న కుమారుడికి అవ‌కాశం కోసం ప్రయ‌త్నించారు. అయితే, ఇది స‌క్సెస్ కాలేదు. ఇక‌, ప్రతిభా భార‌తి త‌న కుమార్తెను రంగంలోకి దింపాల‌ని ప్రయ‌త్నించినా.. స‌క్సెస్ కాలేదు.

జనంలోకి వెళ్లలేక….

ఇక‌, రాజ‌కుమారి ఒక‌సారి త‌న కుమార్తె సుధ‌ను వైసీపీ త‌ర‌ఫున రంగంలోకి దింపి పోటీ చేయించినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో ఇప్పుడు వీరంతా త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. త‌మ త‌ర్వాత త‌మ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని నిల‌బెట్టేదెవ‌ర‌ని త‌ల్లడిల్లుతున్నారు. ఇక ఏపీకే చెందిన మ‌రో కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి తిరుప‌తి ఎంపీగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఆమె కూడా రాజ‌కీయంగా మంచి లైఫ్ కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఈ క్రమంలోనే ఈ మ‌హిళా నేత‌లంతా తాము రీఛార్జ్ చేసుకోవాల‌ని ప్రాధ‌మికంగా నిర్ణయించుకున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి ఏ విధంగా ప్రజ‌ల్లోకి వెళ్తారో.. ఎలా రీచార్జ్ అవుతారో చూడాలి. ఇక‌, వీరి సంగ‌తి ఎలా ఉన్నా.. వీరిని ప్రజ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో న‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News