అందరిలో ఒకటే ఉత్కంఠ… లాక్ డౌన్ ను పొడిగిస్తారా?

కరోనా వైరస్ ఎప్పుడు శాంతిస్తుంది. లాక్ డౌన్ ఏప్రిల్ 14 తరువాత కొనసాగిస్తారా ? లేక ఎత్తేస్తారా ..? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెరతీస్తోంది. [more]

Update: 2020-04-08 12:30 GMT

కరోనా వైరస్ ఎప్పుడు శాంతిస్తుంది. లాక్ డౌన్ ఏప్రిల్ 14 తరువాత కొనసాగిస్తారా ? లేక ఎత్తేస్తారా ..? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెరతీస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు దేశంలో అన్ని కార్యకలాపాలు బంద్ చేశారు ప్రజలు. ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. దాంతో ఒక పక్క ఆర్ధికంగా అందరి బతుకులు ఒక్కసారిగా చితికిపోయాయి. కొందరు పలు ఉద్యోగ, వ్యాపార, విద్యా పనులపై వివిధ రాష్ట్రాలు, దేశాల్లో, జిల్లాల్లో చిక్కుకుపోయారు.

అయిన వారికి దూరంగా….

దాంతో అయినవారికి దూరంగా ఉన్నవారు తీవ్ర ఆందోళన లో ఎప్పుడు లాక్ డౌన్ కి చెక్ పడుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇస్తున్న ప్రకటనలు ఒక్కోసారి ఊరట కలిగిస్తుంటే మరోపక్క దేశంలో అంతకంతకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితిలో లాక్ డౌన్ మరికొంతకాలం ప్రకటిస్తారన్న వార్తలు ఛానెల్స్ లోను నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

అద్దె కట్టలేక …

వైరస్ ను అడ్డుకట్టుకునేందుకు ప్రధాని మోడీ ఒక్కసారిగా లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఆయన పిలుపు ప్రస్తుతం దేశంలో సత్ఫలితాలనే ఇచ్చిందనే చెప్పాలి. ప్రపంచ దేశాలు అన్ని మోడీ చర్యలను ప్రశంసించాయి. భారీ జనాభా తో వారికి సరిపడా వైద్య సదుపాయాలు లేని భారత్ లో దీని కట్టడి అసాధ్యమనే అంతా మొదట భావించారు. అయితే మోడీ అనూహ్యంగా కఠిన నిర్ణయాలను ధైర్యంగా తీసుకుని వైరస్ చైన్ ను బ్రేక్ చేసేందుకు దేశవాసులతో యుద్ధం చేయిస్తున్నారు.

ఎక్కడి వారు అక్కడే?

ఈ నేపథ్యంలో ప్రజలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఎప్పుడు సొంత గూటికి చేరుకుంటారో తెలియక తికమక పడుతూ వత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నారు ఇరుక్కుపోయినవారు. అనేకమంది లాడ్జీల్లో అద్దెలు చెల్లించలేక, మరికొందరు బంధువులు స్నేహితుల ఇళ్ళల్లో ఉండలేక శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్లి అక్కడ లాక్ అయినవారు చేస్తున్న ఆక్రందనలు అన్ని ఇన్ని కావు. అయితే లాక్ డౌన్ ను పొడిగిస్తారన్న అంశం అవాస్తవమే అని కేంద్రం ఖండిస్తున్నా మరోపక్క మోడీ ఎలాంటి ప్రకటన చేస్తారా అన్నది వీరిలో భయం పెంచుతుంది.

Tags:    

Similar News