ఇక గంటా బ్యాలెన్స్ …. ఏపీ తెర మీదకు మరో విలీనం ?

ఏపీలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ అధినాయకత్వం గట్టిగానే తీర్మానించుకుంది. దీన్ని ఏకంగా చట్టసభల్లో గౌరవనీయమైన స్థానంలోఉన్న పెద్ద సభతోనే మొదలుపెట్టింది. అక్కడ ఉన్న నలుగురు [more]

Update: 2019-06-22 06:30 GMT

ఏపీలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ అధినాయకత్వం గట్టిగానే తీర్మానించుకుంది. దీన్ని ఏకంగా చట్టసభల్లో గౌరవనీయమైన స్థానంలోఉన్న పెద్ద సభతోనే మొదలుపెట్టింది. అక్కడ ఉన్న నలుగురు టీడీపీ పెద్ద మనుషులను పార్టీ ఫిరాయించేల చేసి కమలం గూటికి చేర్చేసుకుంది. ఇక ఇప్పుడు ఆపరేషన్ -2 మొదలెట్టబోతోంది. ఈసారి బిగ్ షాక్ నేరుగా చంద్రబాబు నాయుడు కే తగిలేలా కనిపిస్తోంది.ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు కుర్చీ కిందకే నీళ్ళు వస్తాయని అంటున్నారు. ముక్కుతూ మూలుగుతూ కేవలం 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చంద్రబాబు అసెంబ్లీలో తొలి సెషన్ లో తెగ ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సభలొ బిత్తర చూపులు చూస్తూ రెండు పదుల ఎమ్మెల్యేలతో ఇరుకు సొఫాలో సర్దుకుని కూర్చోవడం బాబు వల్ల కావడం లేదు. అయినా సీఎం తరువాత పదవి ప్రతిపక్ష నేతది. పైగా క్యాబినెట్ హోదా. దాంతో మొదట వద్దన్నట్లుగా వార్తలు వచ్చినా ఆ తరువాత మాత్రం బాబు ఒకే అనేశారు. ఏ హోదా లేకపోతే మరీ బాగోదని బాబు ఇలా ఒప్పేసుకున్నారని తమ్ముళ్ళ టాక్. ఇప్పుడు చూడబోతే ఆ పదవికే ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.

గంటా బ్యాచ్ రెడీ :

ఇపుడు ఎమ్మెల్యేలను సమీకరించే పనిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫుల్ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి అధికారం లేకపోతే గంటా సార్ ఎక్కడా ఆగరు. ఆయనకు వైసీపీ గేట్లు మూసేశారు. దాంతో ఇపుడు బీజేపీ వైపు చూపు పడింది. ఎమ్మెల్యేలను పోగు చేసి కమలం పంచన చేరితే వారి దయతో ఏమైన పోస్ట్ తీసుకోవచ్చునన్నది గంటా ప్లన్ అంటున్నారు. గంటా తీరు చూస్తే ఎక్కువ రోజులు ఎమ్మెల్యెగా చేసేలా కూడా కనిపించడంలేదు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీ గూటికి చేర్చినందుకు ప్రతి ఉపకారంగా ఏ రాజ్యసభ పదవో అడిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి తన పదవి కోసం, భవిష్యత్తు రాజకీయం కోసం గంటా పడుతున్న తంటాలు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కే ముచ్చెమటలు పట్టించేలా చేస్తున్నాయట.

హోదా పోయినట్లే :

ఇలా పంతం పట్టి మరీ గంటా వారు టీడీపీ ఎమ్మెల్యేలను ఎరవేసి మరీ తన వెంట తీసుకుపోతే చంద్రబాబు నాయుడు కు ప్రతిపక్ష హోదా పుటుక్కున తెగిపోతుంది. బీజేపీలో టీడీఎల్పీ విలీనానికి 13 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతున్నారు. మొత్తం 23 మందిలో ఇది సగానికంటే ఎక్కువ దాంతో ఆ మ్యాజిక్ నంబర్ కోసం ఇపుడు గంటా బ్యాచ్ చాలా కామ్ గా తమ ప్రయత్నాల్లో మునిగితేలుతోందని అంటున్నారు. ఆ మ్యాజిక్ నంబర్ రాగానే ఎంచక్కా సైకిల్ దిగేసి కమలానికి కరచాలనం చేస్తారని అంటున్నారు. అపుడు చంద్రబాబు నాయుడు వైపు ఉంటే పది మంది ఎమ్మెల్యేలు ఉంటారు. లేకపోతే వారు కూదా ఫిరాయిస్తే ఆ నంబర్ ఎక్కడ ఆగుతుందో కూడా చెప్పడం కష్టమని అంటున్నారు. మరి చూడాలి గంటా దూకుడుతో టీడీపీ కి కూసాలు కదిలే పరిస్థితి ఏర్పడుతోంది.

Tags:    

Similar News