పుట్టింట్లో కలనెరవేరుతుందా ?

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్. క్రికెట్ కి మక్కాగా లార్డ్స్ ను ముద్దుగా పిలుచుకుంటారు. అంతటి ఘన చరిత్ర వున్న లార్డ్స్ ప్రపంచ కప్ ఫైనల్ కి ఆతిధ్య [more]

Update: 2019-07-12 02:59 GMT

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్. క్రికెట్ కి మక్కాగా లార్డ్స్ ను ముద్దుగా పిలుచుకుంటారు. అంతటి ఘన చరిత్ర వున్న లార్డ్స్ ప్రపంచ కప్ ఫైనల్ కి ఆతిధ్య వేదిక కానుంది. నెలన్నరపాటు క్రీడాభిమానుల మనసు దోచుకున్న ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. స్వదేశ అభిమానులను ఏమాత్రం నిరాశ పరచకుండా ఆతిధ్య ఇంగ్లాండ్ తమ దాయాది ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. క్రికెట్ కి పుట్టిల్లుగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడ వరల్డ్ కప్ ను ముద్దాడలేకపోయింది ఇంగ్లాండ్. ఆ కల నెరవేర్చుకునే అవకాశం 1992 లో ఒకసారి వచ్చినా ఆస్ట్రేలియా లో జరిగిన ఫైనల్ లో పాకిస్తాన్ దూరం చేసింది. నాటి ఫైనల్ లో ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పాక్ సేన 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించి ట్రోఫీ ఎగురేసుకుపోయింది. 1975 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు ఫైనల్స్ చేరుకున్న ఇంగ్లాండ్ ఒక్కసారి కప్ అందుకోలేకపోవడం ఇంగ్లిష్ అభిమానులకు తీరని కలనే మిగిల్చింది. అయితే ఇప్పుడైనా స్వదేశంలో ఆ ఆశ నెరవేరాలని మోర్గాన్ సేనను దీవిస్తున్నారు అభిమానులు.

న్యూజిలాండ్ ది అదే డ్రీమ్ ….

ప్రపంచ కప్ ను ఒక్కసారి గెలవని ప్రధాన టీం లలో న్యూజిలాండ్ కూడా ఒకటి. ఆ టీం కూడా ఇండియా ను ఓడించి తన కల నెరవేర్చుకునే క్రమం లో ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 2015 ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై కప్ ను చేజార్చుకుంది కివీస్. ఫైనల్స్ లో 183 పరుగులు కివీస్ చేయగా ఆస్ట్రేలియా 186 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో కప్ గెలిచింది. ఇప్పుడు కెన్ విలియమ్సన్ సారధ్యంలోని న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా వుంది. ముఖ్యంగా లీగ్ టేబుల్ టాపర్ ఇండియా కు న్యూజిలాండ్ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. సమిష్టిగా కివీస్ ఆడితే ప్రత్యర్థి ఎవరైనా స్కోర్ తక్కువైనా, ఎక్కువైనా తమదైన రోజు విలియమ్సన్ సేన ను అడ్డుకోవడం సాధ్యం కాదు. హోమ్ గ్రౌండ్ లో ఇంగ్లీష్ టీం తీవ్ర వత్తిడితో బరిలోకి దిగుతుంది కనుక పటిష్ట వ్యూహంతో తమ డ్రీమ్ నెరవేర్చుకునే ప్లాన్ చేస్తుంది కివీస్. మరి ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ నడుమ సాగే ఈ ఫైనల్ తొలిసారి కప్ అందుకోవాలన్న ఆరాటంలో వున్న ఇద్దరిలో ఎవరకి దక్కుతుందో తెలియాలంటే ఈనెల 14 వరకు వేచి చూడాలి.

Tags:    

Similar News