బొత్సా జెండా ఎగరేస్తారోచ్ ..

పదవులు ఎందుకు అంటే పదిమందిలో దర్జా దర్పం చూసి తరించేందుకు అంటారు. బుగ్గ కారు, హడవుడి లేకపోతే మంత్రికి మామూలు మనిషికి విలువేముంది. అలాగే ప్రతీ ఏటా [more]

Update: 2019-06-22 08:30 GMT

పదవులు ఎందుకు అంటే పదిమందిలో దర్జా దర్పం చూసి తరించేందుకు అంటారు. బుగ్గ కారు, హడవుడి లేకపోతే మంత్రికి మామూలు మనిషికి విలువేముంది. అలాగే ప్రతీ ఏటా వచ్చే ఆగస్ట్ పదిహేను స్వాతంత్రదినోత్సవం వేళ జెండా ఎగరేసి కాలరెగరేయకపోతే మినిస్టర్ పొస్ట్ ఉన్నది ఎందుకు. విషయానికి వస్తే విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఏడాది మంత్రి హోదాలో జెందా వందనం చేయగలరా అన్న డౌట్ ఆయన అనుచరులకు బాగా వచ్చేసింది. ఎందుచేతంటే ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చేశారు. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి ఆ పదవి దక్కింది. ప్రోటోకల్ ప్రకారం ఆమె జెండా వందనం చేస్తే పక్కన సీనియర్ మంత్రి చేతులు కట్టుకుని ఉండాలేమోనని అంతా భావించారు. అయితే తాజాగా జగన్ సర్కార్ ప్రకటించిన ఇంచార్జి మంత్రుల జాబితాలో సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణకు గుర్తింపు ఇస్తూ కర్నూల్ జిల్లాలో ఆయన్ని నియమించారు. దాంతో బొత్స ఇంచార్జి మంత్రి హోదాలో అక్కడ జెండా ఎగరేస్తారన్నమాట. మొత్తానికి ఈ పరిణామంతో బొత్స వర్గం ఫుల్ జోష్ లో ఉంది.

అవంతికి నో చాన్స్ :

ఇక విశాఖపట్నం జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావుకు జెండా ఎగరేసే అవకాశం పక్కాగా దక్కిందని ఆనందపడినంత సేపు లేదు పోవడానికి. ఈ జిల్లాకు సీనియర్ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఇంచార్జి మంత్రిగా జగన్ నియమించారు. ఆ రోజున ఆయన విశాఖలో జెండా వందనం చేస్తారన్నమాట. దాంతో, పక్కన అవంతి శ్రీనివాస్ ఉండాల్సిందే మరి. నిజంగా ఈ హోదా కోసమే చాలా మంది అర్రులు చాస్తారు. అయితే సీనియర్లకు జగన్ చాన్స్ ఇవ్వడంతో ఈసారికి అవంతికి పక్క సీటు తప్పడంలేదు.

ఆ ఇద్దరికీ ఇంతే :

అదే విధంగా విజయనగరంలో పుష్ప శ్రీవాణికి కూడా ఇంచార్జి మంత్రి పదవి దక్కలేదు. సీనియర్ గా ఉన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజుని విజయనగరం జిల్లాకు ఇంచార్జి గా చేశారు. దాంతో ఆయన జిల్లాల్లొ జరిగే స్వాతంత్రదినోత్సవ సంబరాల్లో పాలుపంచుకుని జెండా ఎగరేస్తారన్నమాట. ఇక ఇదే విధంగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఈ జిల్లా ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ మంత్రిగా ఉన్న ధర్మాన క్రిష్ణదాస్ కి మాత్రం ఇంచార్జి మంత్రి హోదా దక్కలేదు. మొత్తానికి చూసుకుంటే జెండా ఎగరేయాలనుకున్న వారి ఆశలు చాలా మంది మంత్రులకు ఈసారి తీరే అవకాశాలు లేవు, మంత్రి అయిన సంతోషం ఇపుడు సగమైందా అంటే సమాధానం వారే చెప్పాలి మరి.

Tags:    

Similar News