బంగ్లాదేశ్ కు సెమిస్ ఛాన్స్ ఉందా ?

తాజా ప్రపంచ కప్ లో పసికూనగా భావించిన బంగ్లాదేశ్ తన సత్తా చాటుతూ సెమిస్ దిశగా అడుగులు వేస్తుంది. తమ అద్భుత ఆటతో క్రికెట్ అభిమానులను అలరిస్తున్న [more]

Update: 2019-06-18 02:32 GMT

తాజా ప్రపంచ కప్ లో పసికూనగా భావించిన బంగ్లాదేశ్ తన సత్తా చాటుతూ సెమిస్ దిశగా అడుగులు వేస్తుంది. తమ అద్భుత ఆటతో క్రికెట్ అభిమానులను అలరిస్తున్న బంగ్లాదేశ్ ప్రస్తుత జోరు కొనసాగిస్తే సెమిస్ చేరుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు క్రీడా విశ్లేషకులు. విండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారీ టార్గెట్ ను ఆడుతూ పాడుతూ బంగ్లా ఛేదించింది. మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. 322 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు కేవలం మూడు వికెట్లు కోల్పోయి 323 పరుగులను చేసింది. దాంతో సెమిస్ కు చేరుకునే అవకాశాలను మరింతగా మెరుగు పరుచుకుంది.

విండీస్ ను ఆడుకున్న షకీబ్ …

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ చేపట్టింది. దాంతో తొలుత బ్యాటింగ్ మొదలు పెట్టిన విండీస్ కు హాప్ (96) లూయిస్ (70) హీట్ మేయర్ (50) రాణించడంతో భారీ స్కోర్ సాధ్యమైంది. అయితే విండీస్ ఆటగాళ్ళ ఆనందం ఎంతో సేపు నిలవకుండా చేశారు బంగ్లా బ్యాట్స్ మెన్. ముఖ్యంగా షకీబ్ ఉల్ హాసన్ 124 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ను తమ వైపు తిప్పేశారు. షకీబ్ కి తోడుగా దాస్ (94), తమీమ్ ఇక్బల్ (48), రాణించడంతో మూడు వికెట్లు కోల్పోయి అపూర్వ విజయం నమోదు చేసింది. బంగ్లా బౌలింగ్ లోమహమ్మద్ సైఫుద్దీన్ 3 వికెట్లు, ముస్తాఫిజర్ రెహమాన్ మూడు, షకీబ్ రెండు వికెట్లు నేలకూల్చారు. విండీస్ బౌలర్లలో రస్సెల్, థామస్ చెరోవికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా బౌలింగ్ లో రెండు వికెట్లు బ్యాటింగ్ లో 124 పరుగులు చేసి ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన షకీబ్ అల్ హాసన్ ఎంపికయ్యారు. ఈ విజయం తో ఇప్పటికి ఐదు పాయింట్లు సాధించిన బంగ్లాదేశ్ సెమిస్ బెర్త్ దక్కించుకోవాలంటే మరో రెండు విజయాలు అందుకోవాలి.

Tags:    

Similar News