నారా లోకేష్‌ ఏమైపోయారు ?

తెలుగుదేశం పార్టీ యువరాజు నారా లోకేష్‌ పై ఇప్పుడు సోషల్ మీడియా లో జోరుగా చర్చ సాగుతుంది. టిడిపిలో సంక్షోభం తరువాత ఆయన వూసే లేకుండా పోయింది. [more]

Update: 2019-06-25 02:42 GMT

తెలుగుదేశం పార్టీ యువరాజు నారా లోకేష్‌ పై ఇప్పుడు సోషల్ మీడియా లో జోరుగా చర్చ సాగుతుంది. టిడిపిలో సంక్షోభం తరువాత ఆయన వూసే లేకుండా పోయింది. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ట్విట్టర్ వేదికగా చెలరేగే లోకేష్ బొత్తిగా నల్లపూస కావడం వ్యూహాత్మకమా ఆయనపై పార్టీలో వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల ఫలితామా అన్నది తేలటం లేదు. ఇంకోపక్క చంద్రబాబు ఆదేశాలమేరకు లోకేష్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే నిత్యం చంద్రబాబు కన్నా ఎక్కువ సందడి గా వుండే నారా లోకేష్‌ ఛాంబర్ బోసిగా కనిపిస్తుంది.

రీఎంట్రీ కి ఆచితూచి …

టిడిపి లో చంద్రబాబు నాయకత్వాన్నే ఆ పార్టీలో మెజారిటీ వర్గాలు కోరుకుంటున్నాయి. అపార అనుభవం వున్న చంద్రబాబు పాలనలోను, పార్టీలోనూ లోకేష్ జ్యోక్యం పెరిగాకా టిడిపి పతనం కావడం మొదలైందని ఆయనకు రాజకీయాల్లో మరింత శిక్షణ అవసరమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే నారా లోకేష్‌ తిరిగి ఎపి పాలిటిక్స్ లో రీ ఎంట్రీ కి భారీ సన్నాహాలు తెరవెనుక సాగుతున్నాయని ఆ పార్టీ వర్గాల్లో మరో టాక్. ఇకపై ఎలాగూ ప్రజా పోరాటాల్లో విపక్ష టిడిపి దూసుకుపోవాలిసి వుంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నాయకుడిగా లోకేష్ ను బాబు ఫీల్డ్ లోకి వదులుతారా లేక ఆయనే మరికొన్నాళ్ళు కుమారుడిని దూరం పెట్టి టిడిపి స్టీరింగ్ తిప్పుతారో వేచి చూడాలి.

Tags:    

Similar News