పార్టీ ఫిరాయించినా కూడా రచ్చ చేయడంలేదుగా ?

నిజానికీ తెలుగుదేశం పార్టీ లో నలుగురు ముఖ్యులైన వారు ఆర్టీ ఫిరాయించారు. వారు ఎవరో కాదు చంద్రబాబుకు అతి సన్నిహితులు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ నుంచి [more]

Update: 2019-06-25 16:30 GMT

నిజానికీ తెలుగుదేశం పార్టీ లో నలుగురు ముఖ్యులైన వారు ఆర్టీ ఫిరాయించారు. వారు ఎవరో కాదు చంద్రబాబుకు అతి సన్నిహితులు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా వీరు తప్పకుండా ఉండాల్సినవారు. బాబు భుజం కాయాల్సిన వారు. కానీ వారు అనూహ్యంగా పార్టీని చాప చుట్టేసి మరీ బీజేపీలోకి వెళ్ళిపోయినా కూడా తమ్ముళ్ళ నోళ్ళు పెగలడంలేదు. మరో వైపు చూస్తే, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మీడియా పాత్ర అంతా ఇంతా కాదు. నిన్నటి వరకూ ప్రజలను సైతం తన ఆలోచనలతో మైండ్ గేమ్ ఆడేసి తమ వారు అనుకున్న పార్టీని గెలిపించేసుకునే మంత్ర తంత్ర విద్యల్లో ఆరితేరిపోయింది.

అనుకూలమేగా :

ఇపుడైతే సోషల్ మీడియా బాగా ఉండడంతో జనాలకు అసలు నిజాలు తెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే గత నెల రోజులు గా బోసిపోయి ఉన్న అనుకూల మీడియా ముఖం ఇపుడు విప్పారుతోంది…ఎందుకంటే…తెలుగు రాజకీయాల్లో నిన్నటి వరకూ పదవులు అనుభవించి తాజా ఎన్నికల్లో చతికిలపడిన తెలుగుదేశం పార్టీ కి జాకీలేసే పనిలో అనుకూల మీడియా ఉంది. అయినా బలం చాలడం లేదు, దాంతో అటునుంచి నరుక్కు రావాలనుకుందేమో. దీనికి తోడు అన్నట్లుగా మోడీ క్యాంప్ లోకి పచ్చ పార్టీ తమ్ముళ్ళు నలుగురు హఠాత్తుగా చేరి కమలనాధులైపోయారు. కొత్త తిలకం దిద్దారు. దీంతో మళ్ళీ అనుకూల మీడియాకు అధికార కళ వచ్చేసిందట.

పక్కా స్కెచ్ తోనేనా :

బీజేపీలోకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఫిరాయిస్తే గట్టిగా విమర్శిస్తూ రాయకుండా కూనిరాగాలు తీయడంతోనే పక్కా స్కెచ్ ఇది అని అర్ధమైపోయింది అంటున్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు మీద ఈగ వాలితేనే సహించలేని పచ్చ మీడియా ఇపుడు ఏకంగా నలుగురు తమ్ముళ్ళు టోకరా వేస్తే ఎందుకు వూరుకుంది. కరెక్టే కదా. ఈ లాజిక్ పాయింట్ కి పచ్చ మీడియా వద్ద జవాబు కూడా లేదు. ఇదే డౌట్ ఇపుడు అందరికీ కలుగుతోంది. అవును మరి ఇక్కడ ఓడినా అక్కడ చేరడం వల్ల మళ్ళీ పచ్చ హవా కొన్నాళ్ళు సాగే అవకాశాలు అయితే బాగా ఉంటాయి కదా అదీ సంబడం అన్న మాట. అందుకే ఎక్కడా పచ్చ గోల లేదు. అంతా ప్లాన్ ప్రకారమేననిపిస్తోంది కదూ.ఇంకో విషయం కూడా విజయసాయిరెడ్డి కనిపెట్టరండోయ్. బీజేపీకి మళ్ళీ న్యూస్ స్పేస్ అనుకూల మీడియాలో పెరిగిందట. చూడాలి మరి ఈ బంధం మళ్ళీ ఎంత బలంగా పెనవేసుకుంటుందో.

Tags:    

Similar News