గెలుపుపై ఎవరికి భయం…?

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చాలా తక్కువ‌గా ఉండ‌డం, రాష్ట్రం యావ‌త్తు కూడా ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లి పోవ‌డం వంటి ప‌రిణామాలు రాజ‌కీయ పార్టీల్లో జోష్ ను పెంచాయి. వేటిక‌వే [more]

Update: 2019-01-06 00:30 GMT

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చాలా తక్కువ‌గా ఉండ‌డం, రాష్ట్రం యావ‌త్తు కూడా ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లి పోవ‌డం వంటి ప‌రిణామాలు రాజ‌కీయ పార్టీల్లో జోష్ ను పెంచాయి. వేటిక‌వే రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించేందుకు ముందుకు వ‌స్తున్నాయి. ఇక‌, ఏ పార్టీకి ఆపార్టీ కూడా విజ‌యం త‌మదేన‌ని చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంద‌డి ప్రారంభ‌మైంది. అధి కార టీడీపీ స‌హా విప‌క్షం వైసీపీ, ప‌వ‌న్‌కు చెందిన జ‌న‌సేనలోనూ నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గెలుపు మాదంటే మాద‌ని ఏ పార్టీకి ఆ పార్టీ వెల్ల‌డిస్తోంది. అయితే, ప్ర‌జ‌లు ఎవ‌రి వైపు ఉన్నార‌నే విష‌యంలో మాత్రం క్లారిటీ ఇప్ప‌టికీ రాలేదు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఎవ‌రు విజ‌యం సాదిస్తారు? అనేది మాత్రం ప్ర‌శ్నార్థ‌కంగానే మారింది.

టీడీపీలో ఆందోళన….

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో అధికార పార్టీ నుంచి ఏ పార్టీ కూడా ఇప్ప‌టికి ప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. మేమే అధికారంలోకి వ‌స్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేక పోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక, విప‌క్షం వైసీపీ కూడా తామే అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమాను వ్య‌క్తం చేయ‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వీటికి ప్ర‌ధాన కార‌ణాలు కూడా ఉన్నాయి. అధికార పార్టీపై ఊపు చూపిస్తున్నా.. లోలోన మాత్రం భ‌యం తాలూకు ముచ్చ‌ట స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా.. విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రంలో ఇంకా ఏదో అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌నే వ్యాఖ్య వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చేస్తున్న ధ‌ర్మ పోరాట దీక్ష‌లు కూడా ఫ‌లించ‌డం లేదు. దీంతో పైకి ఊపు క‌నిపిస్తున్నా.. లోలోన మాత్రం తీవ్ర‌మైన ఆందోళన క‌నిపిస్తోంది.

పైకి ధీమా ఉన్నా….

ఇక‌, వైసీపీ ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ క‌నిపించ‌డం లేదు. పాద‌యాత్ర చేస్తున్నా.. దాని తాలూకు ఎఫెక్ట్ ఏమాత్రం ఉంటుందన్నది తెలియడం లేదు. పైకి మాత్రం వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్ని వాగ్దానాలు చేస్తున్నా.. కూడా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా మొద‌ట్లో ఉన్న ఎఫెక్ట్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. దీంతో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మేన‌న్న‌ది మేధావుల మాట‌. ఇక‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా దీనికి ఏమాత్రం తీసిపోర‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించి సీఎం సీటును అధిరోహించాల‌ని నిర్ణ‌యించుకున్నా కూడా అది ఇప్పుడున్న ప‌రిస్థితిలో చాలా జిల్లాల్లో జ‌న‌సేన నిర్మాణమే లేన‌ప్పుడు గెలుపు అనే విష‌యం సందేహమే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికిప్పుడు ఉన్న ప‌రిస్థితిలో ఎన్నిక‌లు జ‌రిగితే.. జ‌న‌సేన ప‌రిస్థితి దారుణ‌మేన‌ని చెబుతున్నారు. మొత్తంగా మూడు పార్టీల నేత‌లు పైకి గెలుపు మాదే అని చెపుతున్నా లోప‌ల మాత్రం ఎవ‌రికి వాళ్ల‌కు తీవ్ర‌మైన ఆందోళ‌నే క‌నిపిస్తోంది.

Tags:    

Similar News