స్వామీజీ సీక్రెట్ అదేనట?

కరోనా మహమ్మారి అని తెలుసు. దాన్ని ఎవరూ రమ్మనరు. తెలియక చేసిన తప్పుల వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి ఈ రోజు విశ్వవ్యాప్తమై కూర్చుంది. కరోనా [more]

Update: 2020-04-21 09:30 GMT

కరోనా మహమ్మారి అని తెలుసు. దాన్ని ఎవరూ రమ్మనరు. తెలియక చేసిన తప్పుల వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి ఈ రోజు విశ్వవ్యాప్తమై కూర్చుంది. కరోనా భయంతో ప్రపంచం వణికిపోతున్న వేళ అంతా వ్యాక్సిన్ వైపే చూస్తున్నారు. మనం చేయాల్సింది ఏమైనా ఉందా> అని ఎవరూ కూడా అసలు ఆలోచించడంలేదు. నిజంగా ఇది బాధాకరమే. కరోనాకు అసలైన వాక్సిన్ మన చేతల్లోనూ, చేతుల్లోనూ ఉంది అంటున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సిన్ మీద ఆధారపడి ఎంతకాలం బతుకుదామనుకుంటున్నారు. మన పరిసరాలు, మనమూ శుభ్రంగా ఉంటే కరోనావే కాదు ఎన్ని వైరస్ లు వచ్చినా కూడా మనం సేఫ్ అంటున్నారు.

కాల సర్పదోషం….

ఇక ఆధ్యాత్మికపరులు అయితే కరోనా వైరస్ ఎందుకు వచ్చిందని ఒక్కసారి ఆకాశం వైపు చూస్తున్నారు. విశాఖ శారదాపీఠానికి థానికి చెందిన స్వామీజీ స్వరూపానందేంద్ర మొత్తం ప్రపంచానికే కాలసర్ప దోషం ఉందని తేల్చేసారు. అందువల్లనే ఈ విపత్తు పట్టి పీడిస్తోనని కూడా చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 24 తరువాత ఆ పీడ మెల్లగా తగ్గుతూ మే మొదటివారానికల్లా ప్రపంచానికి కొత్త వెలుగు వస్తుందని కూడా చెప్పారు. మే 5వ తేదీ నాటికి కరోనా తీవ్రత బాగా తగ్గుతుందని స్వామీజీ జోస్యం చెప్పారు.

ముప్పు లేదట….

ఈ లాక్ డౌన్ సమయాన్ని దేశమంతా చక్కగా వినియోగించుకుని దైవ చింతనలో గడపాలని కూడా స్వామీజీ సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక దేశంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారత దేశాన్ని ఏ వైరస్ తాకలేదని కూడ స్వామీజీ అంటున్నారు. ఎన్నో పెను విప‌త్తులను చూసిన దేశం భారత్ అని కూడా అంటున్నారు. తాము ఇప్పటికే హోమాలు, జపాలు పీఠంలో చేస్తున్నామని, సర్వ జగత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని స్వామీజీ అంటున్నారు.

శుభవార్తే …

ఓ విధంగా చెప్పాలంటే జనాలు తమ మీద తాము నమ్మకం వదిలేశారు. లాక్ డౌన్ అయినా బయట తిరిగేస్తున్నారు. భౌతిక దూరం అసలు పాటించడంలేదు. కరోనా ఎందుకు వచ్చిందని బాధపడుతున్నారు తప్ప, కరోనాని నియంత్రించడానికి తాము ఏం చేయాలన్నది మరచిపోతున్నారు. స్వాములు చెప్పినా, సైంటిస్టులు చెప్పినా కూడా అంతిమ నినాదం ఒక్కటే. ఇంట్లో కూర్చోండి అన్నదే ప్రతీ ఒక్కరి మాట. మరి జనాలు దాన్ని పూర్తిగా పాటిస్తే కాల సర్ప దోషాలు అయినా, బయోవార్ అయినా కూడా కరోనా మటుమాయం అవుతుంది. ఏది ఏమైనా కరోనాను తలచుకుని భీతిల్లుతున్న జనాలకు స్వామీజీ నాలుగు మంచి మాటలే

Tags:    

Similar News