గాలి ఇక కమలానికి దూరమయినట్లేనా?

గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కింగ్ గా పేరు. గతంలో యడ్యూరప్ప ముఖ్మమంత్రిగా ఉన్నప్పుడు గాలి జనార్థన్ రెడ్డి హవా కొనసాగేది. మంత్రివర్గ సభ్యుడిగా కూడా ఉండటంతో [more]

Update: 2020-09-05 18:29 GMT

గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కింగ్ గా పేరు. గతంలో యడ్యూరప్ప ముఖ్మమంత్రిగా ఉన్నప్పుడు గాలి జనార్థన్ రెడ్డి హవా కొనసాగేది. మంత్రివర్గ సభ్యుడిగా కూడా ఉండటంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. అయితే ఆ తర్వాత గాలి జనార్థన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లారు. ప్రస్తుతం కండిషన్ బెయిల్ పై బయట ఉన్నారు. అయితే ప్రస్తుతం యడ్యూరప్ప గాలి ఫ్యామిలీని పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలిసింది.

కేంద్ర నాయకత్వం సూచనలతో….

గాలి జనార్థన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం బీజీపీ గతంలో తలనొప్పి తెచ్చిపెట్టింది. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా గాలి సోదరుల విషయంలో యడ్యూరప్పకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గాలి జనార్థన్ రెడ్డి స్వైర విహారం చేయాలి. ఆయన మాటకు తిరుగు లేకుండా ఉండాలి. కానీ యడ్డీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా గాలి జనార్థన్ రెడ్డి ఊసే లేకుండా పోయింది.

సన్నిహితులు కూడా దూరం….

గాలి జనార్థన్ రెడ్డికి పార్టీలో కూడా పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన బి. శ్రీరాములు యడ్యూరప్ప మంత్రి వర్గంలో కీలకంగా ఉన్నారు. శ్రీరాములుకు గాలి జనార్థన్ రెడ్డి వల్ల మాత్రం మంత్రి పదవి రాలేదు. ఆయన స్వంత బలంతోనే మంత్రి పదవిని దక్కించు కున్నారు. శ్రీరాములు కూడా గాలి జనార్థన్ రెడ్డిని పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయిన వెంటనే గాలి హవా సాగుతుందని భావించారు.

బెయిల్ పై ఉన్నా కూడా…..

ప్రస్తుతం గాలి జనార్థన్ రెడ్డి న్యాయస్థానం సూచనలతో బెయిల్ పై ఉన్నారు. ఆయన క్రియాశీలకంగా లేరు. తన కేసుల నుంచి బయటపడటమే ఆయన ముందున్న ప్రాధాన్యం. బీజేపీలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు తలెత్తాయి. దీనిపై కూడా గాలి జనార్థన్ రెడ్డి దృష్టి పెట్టడం లేదు. ఆయన ముఖ్యంగా కేసుల నుంచి బయటపడటానికే ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గాలి జనార్థన్ రెడ్డికి ఇటీవల కరోనా సోకింది. మొత్తం మీద యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లవుతున్నా గాలి జనార్థన్ రెడ్డి వేవ్ మాత్రం కన్పించడం లేదు.

Tags:    

Similar News