కుర్చీ కిందకే నీళ్లొచ్చేలా ఉన్నాయే?

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేని పరిస్థిితి. సంకీర్ణ భాగస్వామ్య పక్షాల్లో మళ్లీ లుకలుకలు ప్రారంభమయినట్లే కన్పిస్తుంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి [more]

Update: 2021-04-08 17:30 GMT

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేని పరిస్థిితి. సంకీర్ణ భాగస్వామ్య పక్షాల్లో మళ్లీ లుకలుకలు ప్రారంభమయినట్లే కన్పిస్తుంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటింది. ఇప్పటి వరకూ ఎలాగోలా నెట్టుకొచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశముంటుందని తెలుస్తోంది.

బీజేపీ ప్రయత్నాలు….

మహారాష్ట్రలో తమను కాదని శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టుకట్టిన నాటి నుంచి బీజేపీ ఆగ్రహంతో ఉంది. ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. తొలినాళ్లలోనే అజిత్ పవార్ కు గాలం వేసినా, అది పేలలేదు. దీంతో కొన్నాళ్లు వేచి చూడాలన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ క్రమంగా మళ్లీ పావులు కదుపుతుంది. ప్రస్తుతం మహారాష్ట్ర హోంమంత్రి అవినీతి వ్యవహారం మూడు పార్టీలను ఇబ్బందుల్లోకి నెట్టాయి.

పవార్ స్టెప్ తో…..

ఇక తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ ఆమెకు మద్దతుగా ప్రచారంలోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్ ను కాదని తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి శరద్ పవార్ చేస్తున్న యత్నాలు కూడా కాంగ్రెస్ అగ్రనేతలకు ఆగ్రహం తెప్పించేవిగా ఉన్నాయి. తాము మద్దతిస్తేనే మహారాష్ట్రలో ప్రభుత్వం కొనసాగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నుంచి హెచ్చరికలు కూడా విన్పిస్తున్నాయి.

కాంగ్రెస్ లోనూ అసంతృప్తి….

అయితే శరద్ పవార్ ఇప్పటికే మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ముప్పు లేదని శరద్ పవార్ చెబుతున్నారు. కానీ బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు మానుకోలేదు. కరోనాను కట్టడి చేయడంలోనూ ఉద్ధవ్ థాక్రే విఫలమయ్యారని విపక్షాల నుంచి విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆగ్రహం, బీజేపీ మరోసారి చేస్తున్న ప్రయత్నాలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News