విజయం ముంగిట బోల్తా ….!!

ప్రపంచ కప్ ఫేవరెట్ టీం లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసి విజయం ముంగిట బోల్తా పడింది వెస్ట్ ఇండీస్. విశ్వ విజేతగా నాలుగు సార్లు కప్ [more]

Update: 2019-06-07 03:30 GMT

ప్రపంచ కప్ ఫేవరెట్ టీం లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసి విజయం ముంగిట బోల్తా పడింది వెస్ట్ ఇండీస్. విశ్వ విజేతగా నాలుగు సార్లు కప్ ను ముద్ధాడిన ఆస్ట్రేలియా విండీస్ ను తన రెండో మ్యాచ్ లో చిత్తు చేస్తుందనే విశ్లేషకులు అంచనా వేశారు. అయితే అనూహ్యంగా విండీస్ తన అన్ని వనరులను సమర్ధంగా వినియోగించి మ్యాచ్ ని గెలిచే పరిస్థితి లో కేవలం 15 పరుగుల తేడాతో వత్తిడితో చేజార్చుకుని ఆ దేశ అభిమానులను నిరాశలో ముంచింది. పాకిస్తాన్ ను చిత్తు చేసి జోరు మీద ఆసీస్ పై పోరుకు దిగిన విండీస్ అదే జోష్ కంటిన్యూ చేసింది. అయినా పని జరగలేదు.

నాథన్ విశ్వరూపం ….

తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ నాథన్ 60 బంతుల్లో 92 పరుగులు తో విండీస్ బౌలర్లపై ఊచకోత కోసాడు. ఇక స్టీవ్ స్మిత్ 73 , అలెక్స్ 45 సాయంతో 49 ఓవర్లలో 288 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో బ్రాత్ వైట్ 67 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు, రస్సెల్ 41 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కొట్రెల్ 56 పరుగులు ఇచ్చి 2 వికెట్లు నేలకూల్చారు.

టార్గెట్ దిశగా వెళుతూనే ….

భారీ టార్గెట్ ఛేదన కు రంగంలోకి దిగిన విండీస్ ఓపెనర్ల ను ఆరంభంలోనే కోల్పోయింది. అయితే హోప్ 105 బంతుల్లో 68 , కెప్టెన్ హోల్డర్ 57 బంతుల్లో 51 పూరన్ 36 బంతుల్లో 40 పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించారు. అయితే స్టార్క్ అద్భుతంగా 46 పరుగులు ఇచ్చి 5 వికెట్లు, కమిన్స్ 41 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, జంపా 50 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూల్చి ప్రత్యర్థిని కట్టడి చేశారు. మ్యాచ్ లో పది ఓవర్లు బౌలింగ్ చేయడమే కాదు 92 పరుగులు సాధించిన నాథన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి వరకు టెన్షన్ గా నడిచిన మ్యాచ్ మాత్రం ఒత్తిడిని తట్టుకోగలిగిన ఆసీస్ ను విజయం వరించి ముగియడం విశేషం. అయితే విండీస్ మాత్రం తన పోరాట పటిమతో క్రీడా ప్రేమికుల మనసును దోచుకుంది.

Tags:    

Similar News