నేనే రాజు అంటున్న పెద్దాయన

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఇపుడు లేదు. కన్నా లక్ష్మీ నారాయణ అందులో కూర్చున్నారు. అయితే ఆయన్ని తప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. దానికి సంకేతంగా తెలంగాణాలో [more]

Update: 2020-03-31 00:30 GMT

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఇపుడు లేదు. కన్నా లక్ష్మీ నారాయణ అందులో కూర్చున్నారు. అయితే ఆయన్ని తప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. దానికి సంకేతంగా తెలంగాణాలో బీజేపీ పెద్ద లక్ష్మణ్ ని తీసేసి హఠాత్తుగా బండి సంజయ్ ని తెచ్చిపెట్టారు. ఎంతో మంది సీనియర్లు, ఎన్నో పేర్లూ చక్కర్లు కొట్టినా చివరికి బండి సంజయ్ అనూహ్యంగా పదవిలో కూర్చున్నారు. ఇక ఏపీలో కూడా అదే జరుగుతుంది అంటున్నారు. స్థానిక ఎన్నికల తరువాత ఆ ముచ్చట ఉంటుందనుకుంటే ఇపుడు కరోనా వైరస్ ముందుకొచ్చింది. దీని తరువాత అయినా కొత్త కమలనాధుడు ఏపీకి ఖాయం అని తేలడంతో చాలా మంది రేసులో ఉన్నారు.

ఆయనకు ఛాన్స్….

ఇక ఏపీ బీజేపీలో సీనియర్ నేతగా ఉంటూ వస్తున్నారు విష్ణు కుమార్ రాజు. ఆయన 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా విశాఖ ఉత్తరం నుంచి గెలిచారు. అదే ఊపులో ఆయన ఏపీ బీజేపీ శాసనపక్ష నాయకుడిగా కూడా నియమితులయ్యారు. ఓ దశలో వైసీపీ ఏపీ శాసనసభ సమావేశాలను బాయ్ కాట్ చేయడంతో ఆయనే ఏకైక అపోజిషన్ లీడర్ గా కూడా వ్యవహరించారు. ఆ ఇమేజ్ తో ఇపుడు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠం కావాలంటున్నారు. తనకేమి తక్కువ అన్నది కూడా రాజుగారి ఆలోచనగా ఉంది. ఏపీ అంతటికీ తెలిసిన ఫిగర్ గా తాను ఉన్నానని, అందువల్ల తన చేతిలో పదవి పెడితే పార్టీని బాగు చేస్తానని అంటున్నారు.

పోటీగానా…?

ఇక విశాఖ బీజేపే రాజకీయాలు తీసుకుంటే ఉన్నది పుంజెడు మంది లీడర్లు. అయినా వారి మధ్యలో ఎన్నో విభేదాలు ఉన్నాయి. మాజీ బీజేపీ అధ్యక్షుడు కె హరిబాబు వర్గంలో రాజు గారు ఉన్నారు. ఆయన మరో సీనియర్ నేత, పీవీ చలపతిరావు కుటుంబానికి యాంటిగా ఉంటారని ప్రచారంలో ఉంది. పీవీ చలపతిరావు కుమారుడు మాధవ్ 2014లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు. అయితే ఆయనకు కాకుండా రాజుగారు టికెట్ తెచ్చుకున్నారు. అలా మొదలైంది వివాదం. ఆ తరువాత ఎమ్మెల్సీగా మాధవ్ విజయం సాధించారు. మరో వైపు గత ఏడాది ఎన్నికల్లో రాజు గారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. శాసనమండలి ఇంకా రద్దు కాకపోవడంతో మాధవ్ మాత్రమే ఇపుడు ప్రభుత్వ పదవిలో ఉన్నారు. ఆయన్ని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా చేస్తారని ప్రచారం గా ఉంది. దాంతో ఆయన‌కు పోటీగా రాజుగారు రంగంలోకి వచ్చారా అన్న టాక్ కూడా ఉంది.

బీసీ కార్డు తో ….

ఇక మాధవ్ చూసుకుంటే బీసీ కార్డుతో ముందుకు సాగుతున్నారు. పైగా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కుటుంబంగా ఉండడం. ఆయన తండ్రి పీవీ చలపతిరావు వాజ్ పేయ్ కాలం నాటి మనిషి కావడం, యువకుడు, వాగ్దాటి అన్నీ ఉన్న వారు కావడంతో హై కమాండ్ ఆయన వైపు మొగ్గు చూపిస్తోందని అంటున్నారు. అయితే పీవీ కుటుంబం అంటే గిట్టని వారు రాజు గారిని ఎగదోస్తున్నారని అంటున్నారు. ఆయన వెనక విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓ మాజీ ఎంపీ కూడా ఉన్నారని, అలాగే సీనియర్ నేతలు కొందరు తమకు పదవి దక్కకపోతే రాజు గారిని కుర్చీలో కూర్చోబెట్టాలని ఎత్తుగడలు వేస్తున్నారుట. మరి హై కమాండ్ ఆయన పేరుని ఎంతవరకూ పరిశీలనలోకి తీసుకుంటుందో అన్నది చూడాలి.

Tags:    

Similar News