విశాఖకు ఎప్పుడూ విషాదమేనా ?

విశాఖపట్నం ప్రశాంత నగరం. ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా విశాఖ రావాలనుకుంటారు. అందమైన గమ్యస్థానంగా భావిస్తారు. అటువంటి విశాఖకు ప్రక్రుతి ఎంతటి వరమో అంతటి శాపం. [more]

Update: 2020-05-07 12:30 GMT

విశాఖపట్నం ప్రశాంత నగరం. ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా విశాఖ రావాలనుకుంటారు. అందమైన గమ్యస్థానంగా భావిస్తారు. అటువంటి విశాఖకు ప్రక్రుతి ఎంతటి వరమో అంతటి శాపం. తరచూ తుఫాన్లు విశాఖను పీడిస్తూ ఉంటాయి. 2014 లో హుదూద్ తుఫాన్ విశాహను వణికించిన తీరు అందరికీ తెలుసు. ఆనాడు చిగురుటాకులా నగరం వణికిపోయింది. సాదాగా కనిపించే సాగర గర్భంలో ఉవ్వెత్తిన అలలు విశాఖను అతలాకుతలం చేశాయి. విశాఖ హుదూద్ బాధల నుంచి కోలుకునేసరికి అక్షరాలా రెండేళ్ల వ్యవధి పట్టింది.

అభివ్రుధ్ధే అణుబాంబు….

విశాఖ ఆసియా ఖండంలో శరవేగంగా అభివృధ్ధి చెందిన నగరంగా చెబుతారు. మెట్రో సిటీగా కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రగతి సాధించడానికి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో వెల్లువలా ఏర్పాటైన పరిశ్రమలు. దాంతో ఉపాధి కోసం విశాఖకు వచ్చేవారితో ఈ నగరం ఎంతో ఎత్తుకు ఎదిగింది. అయితే ఇపుడు పరిశ్రమలే పచ్చని విశాఖకు చిచ్చు పెడుతున్నాయి. కాలుష్యపు కోరల్లో నగరం చిక్కుకుని విలవిలలాడుతోంది. విశాఖలో తరచూ పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు అణుబాంబులనే పేలుస్తున్నాయి.

పాతికేళ్ల క్రితం…..

ఇక విశాఖలో ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న హెచ్ పీ సీ ఎల్ లో 1997లో సెప్టెంబర్ నెలలో భారీ పేలుడు సంభవించింది. ఆనాడు కూడా పరిశ్రమలో గాస్ లీక్ అయి భారీ పేలుడుతో చాలామంది చనిపోయారు. ఆ తరువాత తరచూ హెచ్ పీ సీ ఎల్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హెచ్ పీ సీ ఎల్ విశాఖ నగరం మధ్యలోనే ఉంది. అలాగే అనేక ప్రమాదకరమైన పరిశ్రమలు కూడా నగరాన్ని ఆనుకునే ఉన్నాయి.

తూర్పు పడమరలుగా….

విశాఖ నగరానికి తూర్పు ముఖంగా సముద్రం ఉంది. ప్రకృతి విపత్తులకు ఎపుడూ ఆలవాలంగా ఉంటుంది. ఇకి నగరానికి పడమర వైపు చూస్తే వరసగా భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ ప్రమాదకరమైనవే కావడం విశేషం, ప్రభుత్వ సెక్టార్ సంగతి పక్కన పెడితే ప్రైవేట్ రంగంలోని పరిశ్రమలల్లో నిర్వహణ లోపంతో పాటు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తోంది. ఇపుడు నగరానికి అన్ని వైపులా భయాలు పెరిగిపోతున్నాయి. సుందరమైన నగరానికి కాలుష్యం పెద్ద బాధ అనుకుంటే ఇపుడు ఆపదలు ముంచుకొస్తున్నాయి. మొత్తానికి విశాఖ వణుకుతోంది.

Tags:    

Similar News