రాజకీయ రాజధానిగా విశాఖ ?

విశాఖను ఇప్పటిదాకా పలు రకాలుగా కీర్తించారు. ఆర్ధిక రాజధాని అన్నారు, పర్యాటక సినీ రాజధాని అని కితాబు ఇచ్చారు. సాంస్కృతిక రాజధాని అని కూడా గర్వించారు. ఐట్ [more]

Update: 2021-06-08 12:30 GMT

విశాఖను ఇప్పటిదాకా పలు రకాలుగా కీర్తించారు. ఆర్ధిక రాజధాని అన్నారు, పర్యాటక సినీ రాజధాని అని కితాబు ఇచ్చారు. సాంస్కృతిక రాజధాని అని కూడా గర్వించారు. ఐట్ హబ్ అని ముచ్చట చేశారు, ఇక జగన్ ఇవన్నీ కాదు కానీ పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటుందని డైరెక్ట్ గా చట్టమే చేశారు. మరి దాని మహత్య్సమో మరేమో కానీ విశాఖ మాత్రం ఇపుడు సడెన్ గా రాజకీయ రాజధానిగా మారిపోయింది. ఏ నేత అయినా విశాఖ వచ్చి రచ్చ చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ నుంచే తన గొంతు సవరిస్తున్నాడు.

ఫోకస్ పెరిగిందలా…

విశాఖ మీద నాయకలులకు బాగా మోజు పెరిగింది. జగన్ రాజధాని అంటున్నాడు కాబట్టి ముందే జాగా లాగేసి పాగా వేయాలన్న ఉబలాటం కూడా ఎక్కువ అయినట్లుంది. అందుకే విశాఖ నుంచే ఉద్యమం అంటున్నారు. విశాఖ నడిబొడ్డునే నిలబడి గర్జిస్తున్నారు. జగన్ కి విశాఖ మీద అటెన్షన్ ఉండడం వల్ల తాము ఇక్కడ అన్న ప్రతీ మాట ఆయన చెవులకు నేరుగా చేరుతుందన్న వ్యూహం కావచ్చు మరోటి కావచ్చు కానీ నేతాశ్రీలు అంతా విశాఖ చుట్టూ ప్రదక్షిణమే చేస్తున్నారు.

జేడీ మొదలుకుని …

ఎక్కడో కర్నూలు జిల్లాకు చెందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా విశాఖనే తమ కార్యక్షేత్రంగా ఎన్నుకుంటున్నారు. విశాఖ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన అనుభవాన్ని కూడా రంగరించి ఆయన ఉక్కు ఉద్యమానికి ఊపిరిలూదుతున్నారు. విశాఖలోనే మకాం వేసి మారీ పోరాటానికి పదును పెడుతున్నారు. ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు తరచూ విశాఖకే వస్తూ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వామపక్ష నేతలతో పాటు పీసీసీ ప్రెసిడెంట్ శైలజానాధ్ కూడా అనంతపురం జిల్లా నుంచి ఆయాసపడి మరీ విశాఖ వచ్చి విడిది చేస్తున్నారు.

దీక్షస్థలిగా…

మొత్తానికి విశాఖని ఉద్యమ భూమిగా దీక్షాస్థలిగా మార్చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆ మధ్య అమరణ దీక్ష చేపడితే టెన్త్, ఇంటర్ పరీక్షలు కరోనా టైమ్ లో నిర్వహించవద్దు అంటూ ప్రజా శాంతి ప్రెసిడెంట్ కె ఎ పాల్ కూడా విశాఖలో ఆమరణ దీక్షను చేపట్టడం విశేషం. ఇదే రూట్ లో మరికొందరు నేతలు ఇతర ప్రజా సమస్యల మీద విశాఖ నుంచే స‌మర శంఖారావం పూరించనున్నారు. మొత్తానికి జగన్ రాజధాని అని మాత్రమే అన్నారు. ఆయన మాత్రం తాడేపల్లిలోనే ఉన్నారు. కానీ జగన్ మనసెరిగిన ఏపీ రాజకీయం మాత్రం విశాఖే పొలిటికల్ క్యాపిటల్ అంటోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో విశాఖ మరెంతగా సెగలూ పొగలూ పుట్టిస్తుందో.

Tags:    

Similar News