విశాఖపై జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనట

అభివృధ్ధి అంటూ మొదలు కావాలి కానీ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. ఒకపుడు కేవలం 10 లక్షల జనాభా మాత్రమే ఉన్న హైదరాబాద్ ఉమ్మడి ఏపీకి రాజధాని [more]

Update: 2020-08-16 09:30 GMT

అభివృధ్ధి అంటూ మొదలు కావాలి కానీ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. ఒకపుడు కేవలం 10 లక్షల జనాభా మాత్రమే ఉన్న హైదరాబాద్ ఉమ్మడి ఏపీకి రాజధాని కాగానే ఎంతలా ప్రగతిబాటన పరుగులు తీసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కోటి జనాభాతో ప్రపంచంలో అనేక దేశల కంటే కూడా ముందుంది. ఇక ఇపుడు చూస్తే అమరావతి రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారు. దాంతో గుంటూరు, కృష్ణా జిల్లాలు రెండూ జంట నగరాలు అవుతాయని ఆరేళ్ల క్రితం వినిపించిన మాట. ఇపుడు శాసన సభకు మాత్రమే అమరావతి పరిమితం కాబోతోంది.

మహర్దశేనా ….?

దాంతో విశాఖ పరిపాలనారాజధానిగా మారుతోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రా మూడు జిల్లాలను కలుపుకుని చేయబోయే అభివృధ్ధికి సంబంధించి ప్రణాళికల మీద మేధావుల్లో చర్చ సాగుతోంది. ఒకపుడు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కేవలం మధురవాడ వరకే పరిమితం అయి ఉండేది. అంటే సిటీ శివారు మాత్రమే. ఇపుడు జగన్ సర్కార్ ఏకంగా భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం దాకా తీసుకువెళ్ళింది. భోగాపురం విజయనగరంలో ఉంది. మొత్తంగా యాభై అరవై కిలోమీటర్ల దూరంతో ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ తయారు అవుతోంది. అదే కనుక రెడీ అయితే రెండు జిల్లాలు ఇంకా దగ్గర అవుతాయి.

కాన్సెప్ట్ సిటీతో…..

ఇక జగన్ కాన్సెప్ట్ సిటీ అని కొత్త ప్రతిపాదన తెస్తున్నారు. దాన్ని కూడా విజయనగరం జిల్లాలలోని భోగాపురం దగ్గరే ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆ పక్కనే రాజధాని నగరం కూడా ఉంటుందని అంటున్నారు. అంటే ఈ రెండు జిల్లాల సరిహద్దులు చెరిపేసేలా వైసీపీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ని తయారు చేస్తోంది అంటున్నారు. అదే కనుక జరిగితే విజయనగరం జోన్ గా ఏర్పడుతుంది. అపుడు విశాఖ, విజయనగరం మధ్యలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అనేక పరిశ్రమల ఏర్పాటుకు కూడా అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా కొత్త పారిశ్రామిక కూడలిగా కూడా వెనకబడిన విజయనగరం జిల్లా తయారు అవుతుందని అంటున్నారు.

ఉత్తరాంధ్ర చుట్టూ….

విశాఖ రాజధాని అను పేరుకు చెబుతున్నా కూడా మూడు జిల్లాల సమగ్రమైన అభివృధ్ధికి విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసింది. వాటిలో ఏవి ప్రభుత్వ సెక్టార్లో వచ్చే పరిశ్రమలు, ఏవి ప్రైవేట్ భాగస్వామ్యమో అభివ్రుధ్ధి చేయాలన్న దాని మీద కార్యాచరణ కచ్చితంగా ఉంది. ఒకసారి కనుక జగన్ విశాఖకు మకాం మార్చేశాక రానున్న మూడు నాలుగేళ్ళలోనే ఊహించని అభివృధ్ధి ఈ ప్రాంతం సొంతం అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖకు, విజయనగరానికి మధ్యన దాదాపుగా యాభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. రాజధాని వస్తే ఈ దూరం చెరిగిపోతుందని, జంట నగరాలుగా ఈ రెండూ ఉంటాయని కూడా అంటున్నారు. చూడాలి మరి

Tags:    

Similar News