కోహ్లీ, కెన్ ల అరుదైన రికార్డ్

భారత్, న్యూజిలాండ్ కెప్టెన్ లు అనుకోని రీతిలో అరుదైన రికార్డ్ సాధిస్తున్నారు. 2008 లో కెప్టెన్ లు గా విరాట్ కోహ్లీ, కెన్ విలియంసన్ లు అండర్ [more]

Update: 2019-07-08 02:50 GMT

భారత్, న్యూజిలాండ్ కెప్టెన్ లు అనుకోని రీతిలో అరుదైన రికార్డ్ సాధిస్తున్నారు. 2008 లో కెప్టెన్ లు గా విరాట్ కోహ్లీ, కెన్ విలియంసన్ లు అండర్ 19 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ లో తలపడ్డారు. మలేషియా లో జరిగిన నాటి సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి కోహ్లీ అండర్ 19 జట్టును ఫైనల్ చేర్చాడు. ఇప్పుడు ఈ కెప్టెన్ లు ఇద్దరు భారత్, న్యూజిలాండ్ టీం లకు సారధ్యం వహిస్తూ వన్డే ప్రపంచ కప్ లో తలపడుతున్నారు. ఇప్పుడు కోహ్లీ, విలియమ్స్ లు తమ దేశాల ప్రధాన టీం లకు సారధ్యం వహిస్తున్నారు. 11 ఏళ్ళ తరువాత కాకతాళీయంగా అదే సీన్ మళ్ళీ వారి జీవితంలో ఎదురైంది. లీగ్ నుంచి సెమిస్ చేరుకున్న ఈ రెండు టీం లు ఫైనల్ చేరడానికి కసరత్తు చేస్తున్నాయి.

ఎవరిది పై చెయ్యి…..

అండర్ 19 లో కోహ్లీ సేన ఇచ్చిన షాక్ కు ప్రతీకారం విలియంసన్ తీర్చుకుంటాడా లేక 11 ఏళ్ళ క్రితం జరిగిన చేదు అనుభవమే మిగులుతుందా అన్న చర్చ తిరిగి ప్రారంభం అయ్యింది. ఇరు జట్ల కెప్టెన్ లు తమ రెండు సేనలను ఫైనల్ చేర్చడానికి సిద్ధం చేశారు. ఇప్పటివరకు సారధులు ఇరువురు రెండు జట్లకు తమ అద్భుత బ్యాటింగ్ తో స్ఫూర్తివంతంగా నిలిచారు.

అద్భుత ఫామ్ లో కెప్టెన్స్ ….

విరాట్ ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ లో 442 పరుగులు సాధించాడు. అందులో ఐదు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇక విలియమ్స్ ఈ వరల్డ్ కప్ లో ఆడిన 8 మ్యాచ్ లలో 481 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ ఉండటంతో బాటు వెస్ట్ ఇండీస్ సౌత్ ఆఫ్రికాలపై ఒంటిచేత్తో విజయాన్ని అందించి టీం ను సెమిస్ చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అలా రెండు జట్ల కెప్టెన్ లు అద్వితీయ ఫామ్ తో టీం కి ప్రాణం పోస్తూ నువ్వా నేనా అని సవాల్ చేసుకుంటున్నారు.

ఎవరి కల నెరవేరుతుంది ….

ఏ కెప్టెన్ కు అయినా జీవితంలో ఒక్కసారైనా ప్రపంచ కప్ ను తన సారధ్యంలో దేశానికి అందించడం ఒక కల. ఆ కల నెరవేర్చుకోవడానికి ఇరువురు తమ తమ వ్యూహాలతో సర్వసన్నద్ధం అయ్యారు. మరి వీరిలో ఎవరిది పై చెయ్యి అవుతుందో ఎవరు సెమిస్ లో రాణించి తమ టీం ని ఫైనల్ చేరుస్తారన్న ఉత్కంఠ మంగళవారం వీడనుంది.

Tags:    

Similar News