కర్ణాటకలో ముఖ్యమంత్రి ఈయనేనట

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు కుమారుడు ఆటంకంగా మారారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర జోక్యంపై పార్టీలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. సీఎంవో లో [more]

Update: 2021-01-13 17:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు కుమారుడు ఆటంకంగా మారారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర జోక్యంపై పార్టీలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. సీఎంవో లో బీజేపీ నేతను నియమించినా విజయేంద్ర జోక్యం ప్రతి విషయంలోనూ ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన బీజేపీ ఇన్ ఛార్జి అరుణ్ సింగ్ తో అనేక మంది నేతలు ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.

మంత్రుల పేషీల్లోనూ……

అనేక మంది మంత్రుల శాఖల్లో కూడా విజయేంద్ర వేలు పెడుతున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. మంత్రుల వద్దకు ఫైల్ వెళ్లినా వెంటనే దానిని క్లియర్ చేసి పంపాలని మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారికి విజయేంద్ర నుంచి ఫోన్ వస్తుందని చెబుతున్నారు. తద్వారా మంత్రుల ప్రమేయం లేకుండానే ఫైళ్లను క్లియరెన్స్ చేసేందుకు విజయేంద్ర ప్రయత్నిస్తున్నారని కొందరు మంత్రులు సయితం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తమ నియోజకవర్గాలకు….

ఇక ఎమ్మెల్యేల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. సీఎం యడ్యూరప్పను కలవడానికి కష్టమవడంతో ఎమ్మెల్యేలు ఎక్కువగా మంత్రులపైనే ఆధారపడుతున్నారు. అయితే మంత్రులు సయితం విజయేంద్రను సంప్రదించాలని సూచిస్తుండటంతో కొందరు చికాకుతో వెనుదిరిగి వెళుతున్నారు. తమ నియోజకవర్గాలకు నిధులను విడుదల చేసే విషయంలోనూ విజయేంద్ర అనుమతి కావాలని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం విశేషం.

ఉత్తర కర్ణాటక ఎమ్మెల్యేలు….

ఇక ఉత్తర కర్ణాటక ఎమ్మెల్యేలయితే విజయేంద్ర విషయం ఇప్పటికే కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. విజయేంద్ర వసూల్ రాజాగా మారారని, పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటకకు నిధులు నిలిపివేయడం వెనక విజయేంద్ర పాత్ర ఉందని కూడా ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇలా యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర రాజ్యేంగతర శక్తిగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి.

Tags:    

Similar News