టిడిపి మైండ్ గేమ్ లో భాగమేనా కేశినేని నాని వివాదం ?

ప్రధాన అంశాలను డైవర్ట్ చేయాలంటే చిన్న మైండ్ గేమ్ చాలు. టిడిపి ఈ విషయంలో ఆరితేరిపోయింది. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం టిడిపి మైండ్ గేమ్ లు [more]

Update: 2019-06-16 00:30 GMT

ప్రధాన అంశాలను డైవర్ట్ చేయాలంటే చిన్న మైండ్ గేమ్ చాలు. టిడిపి ఈ విషయంలో ఆరితేరిపోయింది. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం టిడిపి మైండ్ గేమ్ లు ప్రజలకు తెలిసిపోయింది. ఫలితం అందరికి తెలిసిందే ఘోరపరాజయాన్ని ఆ పార్టీకి ఇచ్చేశారు జనం. ఎన్నికల ఫలితాల తరువాత చాలా రోజులే టిడిపి శ్రేణులు మౌనముద్రను దాల్చాయి. ఇక జగన్ క్యాబినెట్ ఏర్పాటు అసెంబ్లీ తదితర హడావిడి మొదలయ్యే ముందు ఇక ఆగలేక మళ్ళీ తమ మైండ్ గేమ్ లకు పదునుపెట్టాయి తెలుగుదేశం వర్గాలు. అందులో భాగంగానే విజయవాడ ఎంపి కేశినేని నాని పార్టీపై అలిగిన వ్యవహారమని అంటున్నారు విశ్లేషకులు.

క్యాబినెట్ కూర్పుపై జనంలో చర్చ ను డైవర్ట్ చేసేందుకె …
కులాల వారీగా ఏపీలో గత కొంతకాలంగా అసహనం నెలకొనివుంది. వైసిపి అధినేత ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కొత్త క్యాబినెట్ ను ప్రకటించి సంచలనం సృష్ట్టించారు. అన్ని కులాలకు సమ ప్రాధాన్యతను కల్పిస్తూ సరికొత్త ప్రయోగం చేశారు. దాంతో జనంలో గత టిడిపి క్యాబినెట్ లో కులాలవారీ మంత్రులపై చర్చ మొదలైంది. ఇది గ్రహించిన టిడిపి కేశినేని వెర్సెస్ గల్లా జయదేవ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని కొందరు అంటున్నారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమ కు పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంపై నాని నిజంగానే రగిలిపోయారని ఆ తరువాత లోక్ సభలో గల్లా కు ఇచ్చిన ప్రాధాన్యతపైనా ఆగ్రహంతోనే ఈ దుమారం లేపారని మరోవర్గం వాదిస్తుంది.

వైసిపికి మరో అనుమానం ….
వైసిపి మాత్రం నాని ఎపిసోడ్ ను ఇంకో కోణంలో కూడా అధ్యయనం చేస్తుంది. చంద్రబాబు రాజ్యసభలో బిజెపికి తన ఎంపీల మద్దత్తు ఇస్తామని చెప్పి చీకటి ఒప్పందాన్ని చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అంచనా వేస్తుంది. బాబుపై కేంద్రం ఎలాంటి కేసులు బనాయించకుండా ఉండాలంటే ఎదో రకంగా మోడీని ప్రసన్నం చేసుకోవాలన్న వ్యూహంలో భాగంగా తమ ఎంపీలు బిజెపి వైపు చూస్తున్నట్లు డ్రామా ఆడారని ఆ పార్టీ వర్గాలు ఈ అంశాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఎంపీ గా గెలిచిన వెంటనే ఒక కేంద్రమంత్రి ని నాని కలవడం వెనుక వ్యాపార లావాదేవీలు కాంట్రాక్తుల కోసమేనని కూడా వైసిపి శిబిరం భావిస్తుంది. మొత్తానికి నాని వ్యవహారంపై మాత్రం రోజుకో చర్చ రచ్చ నడుస్తుండటం విశేషం.

Tags:    

Similar News