కేశినేనిలో ఈ మార్పు ఎందుకు?

నిత్య నాలుగు ట్వీట్లు.. రెండు ఫేస్ బుక్ కామెంట్లతో వివాదాల‌కు కేంద్రంగా మారిన విజ‌య‌వాడ ఎంపీ, టీడీపీ నాయ‌కుడు కేశినేని శ్రీనివాస్ ఉర‌ఫ్ కేశినేని నాని.. ఈ [more]

Update: 2019-09-02 12:30 GMT

నిత్య నాలుగు ట్వీట్లు.. రెండు ఫేస్ బుక్ కామెంట్లతో వివాదాల‌కు కేంద్రంగా మారిన విజ‌య‌వాడ ఎంపీ, టీడీపీ నాయ‌కుడు కేశినేని శ్రీనివాస్ ఉర‌ఫ్ కేశినేని నాని.. ఈ మ‌ధ్యకాలంలో చాలా సైలెంట్ అయిపోయారు. రెండోసారి వరుస‌గా విజ‌య‌వాడ నుంచి టీడీపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన నాని.. ఆ వెంట‌నే విమ‌ర్శల‌కు తావిచ్చేలా వ్యవ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఏకంగా ఆయ‌న పార్టీని, పార్టీ నేత‌ల‌ను, మాజీ మంత్రుల‌ను కూడా టార్గెట్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజ‌కీయ దుమారం రేగింది.

ట్వీట్ల జోరుతో…..

ఒకానొక ద‌శ‌లో ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్నకు ఆయ‌న‌కు మ‌ధ్య కూడా ట్వీట్ల యుద్దం జోరుగానే న‌డిచింది. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తున్నార‌ని ప్రశ్నించినా.. నాని త‌న పంథాను మార్చుకోలేదు. ఈ క్రమంలోనే ఆయ‌న బీజేపీలోకి వెళ్తేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని కూడా వ్యాఖ్యలు వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీని మ‌హారాష్ట్రకు వెళ్లి మ‌రీ స‌న్మానించి రావ‌డం.. టీడీపీలో చ‌ర్చనీయాంశంగా మారింది.

రెండు వారాలుగా….

ఇక‌, ఈ క్రమంలోనే వీరి ట్వీట్ల యుద్ధంలో వైసీపీ నాయ‌కుడు, విజ‌యవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ వేలు పెట్టడం, దీనికి ప్రతిగా కొన్ని రోజులు ట్వీట్ల వ‌ర్షం కుర‌వ‌డం, రాజ‌కీయంగా పెను దుమారం రేగ‌డం తెలిసిందే. అయితే, గ‌డిచిన రెండు వారాలుగా నాని సైలెంట్ అయిపోయారు. అస‌లు ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా చేయ‌డం లేదు. అప్పటి వ‌ర‌కు నిత్యం ఏదో ఒక‌ విష‌యం పై స్పందించిన ఆయ‌న ఇలా సైలెంట్ అయిపోవ‌డం వెనుక ఏంజ‌రిగింద‌నే చ‌ర్చ ఇప్పుడు జ‌రుగుతోంది.

పిలవడం మానేయడంతో….

త‌మ‌ను, పార్టీని నిత్యం త‌న ట్వీట్లతో ఇబ్బంది పెడుతున్న కేశినేనిపై చంద్రబాబు టీడీపీ నాయ‌కులు ఫిర్యాదుల‌పై ఫిర్యాదులు చేశారు. దీంతో చంద్రబాబు తొలుత హెచ్చరించినా ఆయ‌న మార‌క‌పోవ‌డంతో అప్పటి నుంచి ప్రాధాన్యం ఇవ్వడం త‌గ్గించేశారు. జ‌గ‌న్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌కు అంద‌రినీ పిలిచినా.. నానికి మాత్రం వ‌ర్తమానం అంద‌లేదు. ఇక‌, పార్టీ త‌ర‌పున చంద్రబాబు ఏ కార్యక్రమానికీ నానిని పిల‌వ‌డం మానేశారు.

అందుకే సైలెంట్ గా….

అదే స‌మ‌యంలో కీల‌క‌మైన పార్టీ విజ‌య‌వాడ అర్భన్ కార్యాల‌యాన్ని కేశినేని నాని ఆఫీస్ నుంచి తీసేసి ఆటోన‌గ‌ర్‌లోని జిల్లా కార్యాల‌యానికి త‌ర‌లించారు. దీంతో కేశినేని నాని వెళ్లిపోయినా.. ఏమై పోయినా త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌నే సంకేతాలు టీడీపీ నుంచి వెళ్లాయి.మ‌రోప‌క్క, బీజేపీలోకి వెళ్లినా.. ఈ ఐదేళ్లు తాను మోడీ భ‌జ‌న చేయ‌డం త‌ప్పితే చేసేది ఏం లేద‌ని గ్రహించిన నాని ఇప్పుడు మౌనం దాల్చార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News